Errabelli Dayakar Rao: ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు.. శరణ్ ఎవరో తెలియదు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు..
ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని.. ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ మోసాలు చేసే NRI శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని.. ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ మోసాలు చేసే NRI శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదన్నారు. భూకబ్జాలు, దందాలు చేసే శరణ్‌ను బీజేపీ తొలగించారన్నారు. సమస్యలతో NRIలు తన దగ్గరకు వస్తారన్న ఎర్రబెల్లి.. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం జరిగిందో.. విచారణలో తేలుతుందన్నారు. తానెవరో తనకు తెలియదని ప్రణీత్‌రావే చెప్పాడని ఎర్రబెల్లి గుర్తుచేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్న ఎర్రబెల్లి .. స్నేహితుల ద్వారా వివిధ పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయన్నారు. వైఎస్ ఉన్నప్పుడు పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని.. మాట వినలేదని అక్రమ కేసులు పెట్టారంటూ పేర్కొన్నారు. కావాలనే వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్ చేశారంటూ ఆరోపించారు.
అయితే.. శరణ్ చౌదరి తనపై ఆరోపణలు చేశారన్నారు. తనకు చాలా మంది NRIలు పరిచయం ఉన్నారన్నారు. శరణ్ పై చాలా కేసులు ఉన్నాయని.. తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదంటూ ఎర్రబెల్లి పేర్కొన్నారు. తనను ఇరికించాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించాయన్నారు. వార్తలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని.. ప్రజల కోసం పనిచేసే సమయంలో అనేకసార్లు కేసులు పెట్టారంటూ వివరించారు.
ఎర్రబెల్లి ఆవేదన, ఆగ్రహానికి కారణాలేంటి? అని చూస్తే.. దుబాయ్ నుంచి NRI శరణ్ చౌదరి టాస్క్‌ఫోర్స్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఓ కేసులో ఎర్రబెల్లి ఒత్తిడితో పోలీసులు తనను వేధించారని ఆరోపించాడు. కూకట్ పల్లి నియోజకవర్గానికి రాకూడదనే దొంగ కేసు పెట్టించారని మండిపడ్డారు. ఎర్రబెల్లి ప్రజా సేవకు పనికి రారని ఆరోపించాడు శరణ్ చౌదరి..
శరణ్ చౌదరి వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన ఎర్రబెల్లి.. అసలు శరణ్ ఎవరో తనకు తెలియదని వివరించారు..
ఎర్రబెల్లి ఏం మాట్లాడారో వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..