Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారి ఫోన్లను కూడా విన్నారు.. ఆపై బెదిరించి…
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వస్తున్నాయి. వజ్రాల వ్యాపారులు, బిజినెస్‌మెన్లు, సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. . దీనిని అదునుగా చేసుకుని ప్రణీత్ రావు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు.
— ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌తో ఆఫీసర్లు తమ సొంత పనులను చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పలువురు అధికారులపై ACB ఫోకస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు అధికారుల లిస్ట్‌ను ఇప్పటికే ACB సిద్ధం చేసినట్లు తెలిసింది.
— హవాలా ముఠాలు, గోల్డ్ షాప్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాప్ చేసింది. కాల్ రికార్డింగ్స్ విని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. బెదిరించడంతో పాటు కేసులు పెడతామని సిటీ పోలీస్ వింగ్ టీమ్ భయబ్రాంతులకు గురి చేసినట్లు కూడా చెప్తున్నారు. విలాసవంతమైన విల్లాల్లో ఈ అధికారులు నివాసం ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిపైనా ఏసీబీ ఆరా తీస్తోంది.
— మరోవైపు 2018, 2019, 2023 ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేల్చారు. ఇతర పార్టీలకు చెందిన నగదు ఫ్లోటింగ్‌ను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు అండ్ టీమ్ మానిటర్ చేసినట్లు నిర్ధారించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…