Viral Video: వింత దొంగ.. పోలీసు డ్రస్ వేసుకొని మరీ చోరీలు. వీడియో.
సాధారణంగా దొంగలు పోలీసులకు భయపడుతుంటారు. ఎక్కడ వచ్చి పట్టుకుంటారో అని. అందుకే ఓ దొంగ వినూత్నంగా ఆలోచించాడు. పోలీసులకు దొరక్కుండా ఉండాలంటే తానూ వారిలో ఒకడిగా మారిపోతే పోలా.. అనుకున్నాడు. ఎలాగో ఓ పోలీసు యూనిఫాం సంపాదించాడు. రోజూ ఆ పోలీసు దుస్తులు వేసుకొని తానొక కానిస్టేబుల్‌ని అంటూ లాఠీ చేత్తో పట్టుకొని బిల్డప్ ఇస్తూ వీలు చిక్కిన దగ్గరల్లా చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు.
సాధారణంగా దొంగలు పోలీసులకు భయపడుతుంటారు. ఎక్కడ వచ్చి పట్టుకుంటారో అని. అందుకే ఓ దొంగ వినూత్నంగా ఆలోచించాడు. పోలీసులకు దొరక్కుండా ఉండాలంటే తానూ వారిలో ఒకడిగా మారిపోతే పోలా.. అనుకున్నాడు. ఎలాగో ఓ పోలీసు యూనిఫాం సంపాదించాడు. రోజూ ఆ పోలీసు దుస్తులు వేసుకొని తానొక కానిస్టేబుల్‌ని అంటూ లాఠీ చేత్తో పట్టుకొని బిల్డప్ ఇస్తూ వీలు చిక్కిన దగ్గరల్లా చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. పోలీసు గెటప్ వేసినా దొంగ లక్షణం పోదుకదా.. దొరికిపోయాడు. అసలు పోలీసులు రంగంలోకి దిగేసరికి నకిలీ పోలీసు బాగోతం బయటపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కడెం మండలం కోండుకూరు గ్రామంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో స్థానికులు తలల పట్టుకున్నారు. చివరికి ఓ పోలీసే దొంగ అని తెలిసి అవాక్కయ్యారు. కానిస్టేబుల్ బట్టలు వేసుకొని, లాఠీ చేత్తోపట్టుకొని ఠీవీగా వచ్చి పెట్రోలు బంకులో సెల్‌ఫోను కొట్టేసి, సమీపంలోని ఓ దాబాలో మరో చోరీకి యత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుడు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

