AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటే ఐడియా సర్ జీ.. కోతుల్ని తరిమేందుకు భలే ఉపాయం చేశారుగా.. చూస్తే అవాక్కే బ్రో..!

కరీంనగరాన్ని కోతులు చుట్టుముట్టేస్తున్నాయి..పట్టణమంతా వీరంగాన్ని‌ సృష్టిస్తున్నాయి....గుంపుగుంపులుగా వెళ్తూ నగరవాసులకి చెమటలు పట్టిస్తున్నాయి...కోతులు చేస్తున్న హాల్ చల్ కి చెక్ పెట్టెందుకు కొండముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు‌ నగరవాసులు. ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్తా ఊపిరి పీల్చుకొని ఎలాంటి భయం లేకుండా ఇంట్లో కి వెళుతున్నామని అంటున్నారు.

వాటే ఐడియా సర్ జీ.. కోతుల్ని తరిమేందుకు భలే ఉపాయం చేశారుగా.. చూస్తే అవాక్కే బ్రో..!
Langur Monkeys Flexis
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Dec 18, 2024 | 1:12 PM

Share

కరీంనగర్ సమీపంలో గతంలో ఎత్తైనా కొండలు ఉండేవి. ఆ కొండల్లో కోతులు తిష్టవేసేవి. రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది. దీంతో కొండలన్నీ కరిగిపోయాయి. ఈక్రమంలో కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా కోతుల ఖ్య పెరిగిపోయింది. భగత్ నగర్ ,తిరుమలనగర్, లక్ష్మీనగర్ ,హౌజింగ్ బోర్డు కాలనీలలో వీటి సంచారం ఎక్కువగా ఉన్నది.లక్ష్మీనగర్ లో గేట్ల పైనే తిష్టవేసి ఎటూ వెళ్ళాకుండా యజమానులను భయపెట్టిస్తున్నాయి.

గతంలో కొన్ని రోజులు కొండముచ్చును తిప్పారు. అప్పుడు తాత్కలిక‌ విముక్తి లభించింది. అయితే అ కొండముచ్చును మెయింటనెన్స్ చేయలేకపోవడంతో అక్కడి నుండి తరలించారు. కొండముచ్చు స్థానంలో కొండముచ్చు ఫ్లేక్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ వాసులు నిర్ణయించారు. దీనితో ప్రతి‌ ఇంటి గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. గత వారం రోజుల నుండి కూడా కోతుల సంచారం తగ్గింది. ఒకరిని చూసి మరోకరు గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.

ఈ కొండముచ్చు బొమ్మలు కూడ కోతిని భయపెట్టె విధంగానే అహాభావాలు  కలిగి ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. కోతులు కూడ ఆ ఫ్లెక్సీలని చూసి భయంతో పరుగులు తీస్తున్నాయి. గేటు మొత్తం ఫ్లెక్సీలను కట్టారు.ఎప్పుడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారో అప్పటినుండి కోతుల బెడద తగ్గిందని కాలనీ వాసులు చెబుతున్నారు.  లక్ష్మీనగర్ వాసులు ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్తా ఊపిరి పీల్చుకొని ఎలాంటి భయం లేకుండా ఇంట్లో కి వెళుతున్నామని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

Langur Monkeys Flexis

ఈ కాలనీలలో పెద్ద ఎత్తున్న కొతుల సంచారం ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడే వారిమని అంటున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కొండముచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కోతుల బెడదల నుండి విముక్తి అయ్యామని తెలుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..