Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: టెన్షన్ ఎందుకు నేనున్నాగా.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్.. వీడియో చూశారా..?

ఇంకెవరున్నారు..? అనుకునేలోపే.. నేనున్నా అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేశారు.. స్వయంగా కేటీఆర్ ఆటో హ్యాండిల్ పట్టుకొని ఆటో స్టార్ట్ చేశారు.. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు… మిగతా పబ్లిక్ ఆసక్తిగా చూస్తుండగానే కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కించుకొని రయ్యిమని బయలుదేరారు కేటీఆర్..

KTR: టెన్షన్ ఎందుకు నేనున్నాగా.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్.. వీడియో చూశారా..?
Ktr Auto Drive
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 18, 2024 | 12:07 PM

రాజకీయ నాయకులు ర్యాలీలు తీయడం కామన్. అది కార్లతో, బస్సులతో కన్వాయ్ పెట్టి ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ ఈ రోజు అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, ఆటో కార్మికులకు ఇన్సూరెన్సు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. ఖాకీ యూనిఫాం వేసుకొని ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి 25 ఆటోల్లో బయలుదేరారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే తలసాని ఇంటి నుంచి నడుచుకుంటూ రోడ్డు వరకు వచ్చిన ఎమ్మెల్యేలు బయట ఉన్న ఆటోల్లో ఎక్కారు. కానీ, అక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆటో నడిపే డ్రైవర్లను అసెంబ్లీ లోపలికి రానివ్వరు. దీంతో ఎమ్మెల్యేలు స్వయంగా ఆటో నడుపుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎవరికి ఆటో డ్రైవింగ్ వచ్చు అని సందేహం ఏర్పడింది.. దీంతో వెంటనే నాకు ఆటో నడపడం వచ్చి అంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగంలోకి దిగి ఆటో హ్యాండిల్ పట్టుకున్నారు. అ తర్వాత మరో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మరో ఆటో అందుకున్నారు..

Ktr

Ktr

ఇంకెవరున్నారు..? అనుకునేలోపే.. నేనున్నా అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేశారు.. స్వయంగా కేటీఆర్ ఆటో హ్యాండిల్ పట్టుకొని ఆటో స్టార్ట్ చేశారు.. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు… మిగతా పబ్లిక్ ఆసక్తిగా చూస్తుండగానే కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కించుకొని రయ్యిమని బయలుదేరారు కేటీఆర్..

వీడియో చూడండి..

ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి అసెంబ్లీ వరకు కేటీఆర్ ట్రాఫిక్ లో ఆటో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేశారు. కేటీఆర్ ఆటో డ్రైవింగ్ ని రోడ్డుపై ఉన్న ప్రయాణికులు వీడియో తీసుకున్నారు.

అంతే కాదు ఈ రోజు కేటీఆర్ పెళ్లిరోజు కూడా… పెళ్లిరోజున కేటీఆర్ ఆటో ఎక్కాడు అంటూ మిగతా ఎమ్మెల్యేలు సరదాగా మాట్లాడుకున్నారు.

వీడియో తీసుకున్న తీన్మార్ మల్లన్న..

ఇదిలాఉంటే.. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి తీన్మార్ మల్లన్న కారును ఆపారు.. బాగుంది మీ నిరసన అంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్ లో నుంచి తన ఫోన్ లో వీడియో తీసుకున్నారు..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి