మా గారాల రామ చిలుక తప్పిపోయింది.. పట్టిస్తే భారీ బహుమానం..! యజమాని బంపరాఫర్

ఈ క్రమంలోనే డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ఆ రామ చిలుక కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందో.. తిరిగి సాయంత్రం వరకు వస్తుందిలే అనుకున్నాడు నవీన్‌. కానీ అది రాలేదు. దీంతో నవీన్ పాఠక్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ తర్వాత అది ఎంతకూ రాకపోవడంతో దాని కోసం ఆ ఇంటి పరిసరాలు, ఆ ప్రాంతం మొత్తం వెతకడం ప్రారంభించాడు. చిలుక ఆచూకీ కోసం చుట్టుపక్కల అందిరినీ అడగడం ప్రారంభించాడు.

మా గారాల రామ చిలుక తప్పిపోయింది.. పట్టిస్తే భారీ బహుమానం..! యజమాని బంపరాఫర్
Missing Parrot
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 18, 2024 | 10:43 AM

చాలా మంది తమ ఇళ్లలో రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. కొందరు కుక్కలు, పిల్లుల్ని పెంచుకుంటే, మరికొందరు పిచ్చుకలు, కుందేళ్లు, పావురాళ్లు, రామచిలుకను కూడా పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబంలో సభ్యులుగా ప్రేమిస్తారు. దానికి తిండి దగ్గరి నుంచి ఆరోగ్యం వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అవి కూడా తన యజమాని పట్ల అంతే ప్రేమ, అప్యాయత, విశ్వాసంతో ఉంటాయి. తమ యజమాని మరణం తట్టుకోలేక చాలా సందర్భాల్లో పెంపుడు జంతువులు మరణించిన వార్తలు అనేకం వార్తల్లో చూశాం. అలాగే, పెంపుడు జంతువుల కోసం యజమాని సైతం మంచంపట్టిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉదాంతం వెలుగుతోకి వచ్చింది. ఓ వ్యక్తి తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న రామ చిలుక కనిపించకపోవడంతో.. దాని ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నాడు. చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌కు చెందిన నవీన్ పాఠక్ అనే వ్యక్తి.. రామ చిలుకను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ఆ రామ చిలుక కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందో.. తిరిగి సాయంత్రం వరకు వస్తుందిలే అనుకున్నాడు నవీన్‌. కానీ అది రాలేదు. దీంతో నవీన్ పాఠక్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ తర్వాత అది ఎంతకూ రాకపోవడంతో దాని కోసం ఆ ఇంటి పరిసరాలు, ఆ ప్రాంతం మొత్తం వెతకడం ప్రారంభించాడు. చిలుక ఆచూకీ కోసం చుట్టుపక్కల అందిరినీ అడగడం ప్రారంభించాడు.

ఆ చిలుక అంటే నవీన్‌ పాఠక్‌ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. దాన్ని వారు ముద్దుగా ‘విష్ణు’ అని పిలుచుకుంటారట. చిన్ననాటి నుంచి చూసుకుంటున్న చిలుక ఇంట్లోంచి పారిపోవడంతో ఆ ఇంట్లో పిల్లలు తిండి మానేశారని వాపోయాడు.. కుటుంబం మొత్తానికి ఎంతో ఇష్టం. దాన్ని వారు ముద్దుగా ‘విష్ణు’ అని పిలుచుకుంటారు. తమ రామ చిలుక కనిపించకపోవడంతో ఇంటిల్లిపాది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన రామ చిలుక ఎలాగైనా సరే తన వద్దకు రావాలని నవీన్ పాఠక్ భారీ బహుమానం ప్రకటించారు. తన రామచిలుక విష్ణును తీసుకువచ్చి ఇచ్చిన వారికి రూ. 1 లక్ష బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. దీంతో ఈ వార్త కాస్తా ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!