AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు.? అలెక్సాను భారతీయులు అడిగిన ప్రశ్నలు ఇవే

క్రికెట్ నుంచి సినిమాల వరకు, ముకేశ్ అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు ఇలా ఎన్నో ప్రశ్నలకు భారతీయులు అలెక్సా సాయాన్ని కోరుతున్నారు. అప్డేట్స్తో పాటు జనరల్ నాలెడ్జ్, యుటిలిటీ, డెయిలీ లైఫ్ గురించి అడుగుతున్నారు. 2024లో అలెక్సాను ఎక్కువగా అడిగిన ప్రశ్నలెంటో చూద్దాం.

అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు.? అలెక్సాను భారతీయులు అడిగిన ప్రశ్నలు ఇవే
Alexa 2024
Ravi C
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 18, 2024 | 4:20 PM

Share

మరో రెండు వారాల్లో 2024 ముగియనుంది. కొత్త ఏడాదికి ప్రపంచమంతా స్వాగతం పలకనుంది. ఈ నేపథ్యంలో 2024లో అమెజాన్​ వాయిస్​ అసిస్టెంట్ అలెక్సాను ఇండియన్స్ ఎంతగా ఉపయోగించారనే విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది. ఏడాది మొత్తం ఏయే ప్రశ్నలకు ఎక్కువగా అలెక్సా సాయాన్ని తీసుకున్నారో చూద్దాం. క్రికెట్​ నుంచి సినిమాల అప్డేట్స్​తో పాటు జనరల్​ నాలెడ్జ్​, యుటిలిటీ, డెయిలీ లైఫ్​ గురించి భారతీయ యూజర్లు అలెక్సాను ప్రశ్నించారు. ప్రముఖుల ఆస్తుల వివరాలు, వారి ఎత్తు, వయస్సు సంబంధిత అంశాలను తెలుసుకున్నారు.

కోహ్లీ ఎత్తు ఎంత?

అలెక్సాను అడిగిన ప్రశ్నల్లో టీమిండియా క్రికెటర్​ విరాట్ కోహ్లీ గురించే అధికంగా ఉండటం విశేషం. కోహ్లీ నికర విలువ, అతని ఎత్తు, వయస్సు, భార్యకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. క్రికెట్​ విషయానికి వస్తే రోహిత్​ శర్మ, రవీంద్ర జడేజాకు సంబంధించిన అంశాలపైనా ఎక్కువగానే అడిగారు. క్రికెట్​ స్కోర్ల కోసమూ అలెక్సాపై ఆధారపడ్డారు. అంతేకాకుండా బాలీవుడ్​ హీరోయిన్​ కృతి సనన్​ ఎత్తు ఎంత?, ముకేశ్​ అంబానీ నికర విలువ ఎంత? అనే ప్రశ్నలు సైతం సంధించారు.

రోజువారీ అప్డేట్ల కోసం..

అలాగే రోజువారీ వార్తలు, అప్డేట్ల కోసమూ అలెక్సాపై భారతయ యూజర్లు ఎక్కువగా ఆధారపడ్డారు. జాతకాలు, పండగ తేదీలు, భూమిపై జనాభా ఎంత? భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత? వంటివి రెగ్యులర్​ అడిగిన ప్రశ్నల్లో ఉన్నాయి. ఇక పాటల కోసమైతే చెప్పనక్కర్లేదు. వినియోగదారుల ఇళ్లలో అలెక్సా నిరంతర రేడియోగా మారిపోయింది. భక్తి పాటలు, బాలీవుడ్​, పాప్​ సంగీతాన్ని విన్నారు. హనుమాన్​ చాలీసా, గాయత్రి మంత్రం, రామ్​సియా రామ్​ వంటి పాటల కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు. సినిమా పాటల విషయానికి వస్తే యానిమల్​ చిత్రంలోని అబ్రార్​ ఎంట్రీ – జమాల్​ కుడు, నాటు నాటు, ఇల్యుమినాటి, అఖియాన్​ వంటి బాలీవుడ్​ హిట్స్​ విన్నారు. అన్నింటికి మించి వంటలు వండేందుకు సైతం అలెక్సా సాయాన్ని తీసుకోవడం కొసమెరుపు.