AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేం చిత్రమూ..! బ్రహ్మం గారు చెప్పిన వింతేనా.. చింత చెట్టును అంతా షాక్..!

బ్రహ్మం గారు చెప్పిన వింతేనా ఇదే అంటూ చింత చెట్టును చూసి అంతా నివ్వెరపోతున్నారు. తాటి, ఈత చెట్లకు కారినట్లుగా చింత చెట్టుకు కల్లు వస్తోంది. ఈ వింత ఘటనను చూసేందుకు గ్రామస్తులతోపాటు పొరుగు గ్రామాలకు చెందిన వారు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

Telangana: ఇదేం చిత్రమూ..! బ్రహ్మం గారు చెప్పిన వింతేనా.. చింత చెట్టును అంతా షాక్..!
Tamarisk Tree Kallu
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 18, 2024 | 4:01 PM

Share

బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు.. తాటి, ఈత చెట్లకు చింత చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు..

తాటి చెట్లు.. ఈత చెట్లకు కల్లు రావడం సహజం. అక్కడక్కడా వేప చెట్లకు కళ్ళు వచ్చిన సంఘటనలు కూడా చూశాం. కానీ అదే విచిత్రమో..! చింతచెట్టుకు కల్లు రావడం జనాన్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఆ కళ్లు తాగి లొట్టలేస్తున్న జనం అంతా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం లీలే అంటున్నారు. సాధారణంగా తాటి, ఈత చెట్లకు కల్లు వస్తుంది. ఇక్కడ చింత చెట్టు నుంచి కల్లు కారడం ఏమిటో అంతుబట్టడంలేదంటున్నారు స్థానికులు. ఇలాంటి దృశ్యాన్ని తాము గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.. కొందరైతే ఏకంగా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.. బ్రహ్మంగారు చెప్పినట్లు లోకంలో ఎంతో వింతలు జరిగిపోతున్నాయని చెప్పుకుంటున్నారు.

ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబేల్లి గ్రామంలో జరిగింది. పోచమ్మ దేవాలయం పక్కనే ఉన్న చింత చెట్టు కల్లు వస్తుంది. తాటి చెట్లు, ఈత చెట్టు నుండి ఎలా కల్లు వస్తుందో అదే తరహాలో చింత చెట్టు నుండి కల్లు వస్తుంది. ఈ విచిత్రమైన సంఘటన వెలుబేల్లి గ్రామంలో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చింత చెట్టుకు కల్లు రావడాన్ని చూసేందుకు గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి నివ్వెరపోతున్నారు. బ్రహ్మంగారు చెప్పిన వింతే ఇది అంటున్నారు. చింత చెట్టుకు కల్లు రావడం అంతా మహత్యమని చర్చించుకుంటున్నారు. ఈ మాట ఈ మాట పొరుగు ఊర్లకు పాకడంతో చింత కల్లును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..