కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Phani CH

|

Updated on: Dec 18, 2024 | 1:31 PM

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారితో పాటు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వారు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కార్డులు జారీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.

రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ స్కీమ్‌లకు రేషన్ కార్డు లింక్ ఉంది. దీంతో వీటి కోసం నిరీక్షిస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్డుల జారీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. త్వరలో ఈ ప్రక్రియ షురూ అవుతుందన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల మంజూరు మొదలవుతుందన్నారు ఉత్తమ్. ఇప్పటికే ఈ విషయంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యాన్ని కూడా అర్హులకు అందిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లికొడుకుతో హద్దు మీరి మరదలు డాన్స్.. పెళ్లి కూతురు రియాక్షన్ !!

ఓరుగల్లు అబ్బాయి, ఇటలీ అమ్మాయిల ప్రేమ కథ.. క్లైమాక్స్ లో..

TOP 9 ET News: RRRను దాటేసిన పుష్ప రాజ్ | తండ్రి మాత్రమే కాదు.. అమ్మ కూడా విష్ణు పక్షమే

వీడెవడండి బాబూ !! చిన్న విషయానికే చేతి వేళ్లు నరుక్కున్నాడు !!

ప్రేమ దక్కాలంటే త్యాగం చేయాలి.. అందుకే అతడి కోసం సినిమాలు వదలేయాలని అనుకున్నా..