వీడెవడండి బాబూ !! చిన్న విషయానికే చేతి వేళ్లు నరుక్కున్నాడు !!
గుజరాత్‌లోని సూరత్‌లో విచిత్రమైన... విషాదకర సంఘటన జరిగింది. ఓ యువకుడు.. తన బంధువులకు చెందిన వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేయడం నచ్చక తన ఎడమ చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. మయూర్ తారాపర రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయాడు.
అతని చేతివేళ్లు కూడా తెగిపోయినట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అసలేం జరిగిందా అని పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేశారు. కానీ మయూర్ మొదట ఓ కట్టు కథను అల్లాడు. తన చేతి వేళ్లను ఎవరో కత్తిరించారని చెప్పాడు. అయితే ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలో చూడగా… పని చేయడం ఇష్టం లేక తనకు తానే ఉద్దేశపూర్వకంగా చేతి వేళ్లను నరుక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని వరచ్చా మినీ బజార్‌లోని తన బంధువుల డైమండ్స్ దుకాణంలో పని చేయడం ఇష్టం లేకే మయూర్ ఈ చర్యకు పాల్పడినట్లుగా సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పని చేయలేనని అతను తన కుటుంబ సభ్యులకు, యజమానికి చెప్పలేక ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తన ఎడమ చేతి నాలుగు వేళ్లను కత్తితో నరుక్కొని… బ్యాగులో పడేశాడు. ఇందుకోసం సింగన్పూర్లోని చార్ రాస్తా సమీపంలోని ఓ దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు. కత్తిని కొనుగోలు చేసిన నాలుగు రోజుల తర్వాత ఓ రాత్రి అమ్రోలి రింగ్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడ మోటార్ సైకిల్‌ను పార్క్ చేసి రాత్రి పది గంటల సమయంలో తన చేతి వేళ్లను నరుక్కున్నాడు. మయూర్ ఈ దుకాణంలో అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అమ్రోలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ దక్కాలంటే త్యాగం చేయాలి.. అందుకే అతడి కోసం సినిమాలు వదలేయాలని అనుకున్నా..
గతాన్ని గుర్తుకుతెచ్చుకుని స్టేజ్‌పైనే ఏడ్చిన యూట్యూబ్ స్టార్
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
జేసీబీతో నేల చదును చేస్తుండగా వింత శబ్ధాలు.. ఆ తర్వాత
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా..
చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు

