AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉపాధికి దారి చూపుతున్న వరినాట్ల పనులు.. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎తోపాటు వివిధ పట్టణాల్లో భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా పొరుగు రాష్ట్రాల కూలీలు పనిచేస్తుంటారు. ఇప్పుడు వ్యవసాయ పొలాల్లో ఈ కూలీలు వరి నాట్లతో సందడి చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల జానపదాలతో ఈ పొరుగు రాష్ట్రాల కూలీలు వ్యవసాయ పొలాల్లో నాట్లు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ధాన్య బండాగారంగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయి.

Telangana: ఉపాధికి దారి చూపుతున్న వరినాట్ల పనులు.. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలు
Wokers In The Field
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 01, 2023 | 5:57 PM

Share

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎తోపాటు వివిధ పట్టణాల్లో భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా పొరుగు రాష్ట్రాల కూలీలు పనిచేస్తుంటారు. ఇప్పుడు వ్యవసాయ పొలాల్లో ఈ కూలీలు వరి నాట్లతో సందడి చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల జానపదాలతో ఈ పొరుగు రాష్ట్రాల కూలీలు వ్యవసాయ పొలాల్లో నాట్లు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ధాన్య బండాగారంగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇక్కడి రైస్ మిల్లులో కూడా పొరుగు రాష్ట్రాల కూలీలే కనిపిస్తుంటారు. దీనికి భిన్నంగా పొరుగు రాష్ట్రాల కూలీలు పొలం బాట పట్టారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలు ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా ప్రవేశించారు. ఈ పొరుగు రాష్ట్రాల కూలీలతో రైతంగానికి వ్యవసాయ కూలీల కొరత తీరుతోంది.

రాష్ట్రంలోని అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 లక్షల ఎకరాల వరి సాగవుతోంది. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో వరి నాట్ల జోరు అందుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరతతో పలువురు రైతులు వరినాటు యంత్రాలు, సీడ్‌డ్రిల్‌, డ్రమ్‌సీడర్‌, వెదజల్లే పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. అత్యధిక శాతం రైతులు మాత్రం కూలీలపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కూలీలు గుంపులుగా వచ్చి పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మహారాష్ట్ర, బిహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వేలాది మందికి పైగా కూలీలు ఇక్కడికి వచ్చారు. స్థానిక కూలీల కొరత, సమయాభావంతో నార్లు ముదిరిపొతుండటం రైతుల ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

స్థానికంగా అద్దె ఇళ్లలో ఉంటూ తెల్లవారుజామునే తమకు కేటాయించిన గ్రామాలకు చేరి పొలాల బాట పడుతున్నారు కూలీలు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పొరుగు రాష్ట్రాల కూలీలు నాట్లు వేస్తున్నారు. గతంలో కేవలం పురుషులే ఉండగా తాజాగా మహిళలు, యువకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో తమ జానపద గీతాలతో స్థానికులను ఆకట్టుకుంటున్నారు. చేతినిండా పని లేకపోవడంతోనే ఇక్కడికి వచ్చామని పొరుగు రాష్ట్రాలకు కూలీలు చెబుతున్నారు. రెండు నెలలపాటు ఇక్కడే ఉంటున్నామని, రోజుకు ఐదెకరాల వరకు నాట్లు వేస్తున్నామని అంటున్నారు. సాధారణంగా స్థానిక కూలీలు 10 నుంచి 12 మంది ఎకరంలో నారు తీసి నాట్లు వేస్తుండగా, పొరుగు రాష్ట్రాల కూలీలు రెండున్నర ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. స్థానిక కూలీలకు రూ.7వేల పైగా ఖర్చు అవుతుండగా.. పొరుగు రాష్ట్రాల కూలీలతో 2000 రూపాయలు మిగులుతున్నాయని రైతులు చెబుతున్నారు. వీరితో కూలీల కొరత, శ్రమ, పెట్టుబడి కొంత ఆదా అవుతుండగా సమయం కూడా కలిసి వస్తుందని రైతులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..