Telangana: ఆ ఆడియో నాది కాదు.. నాకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు.. ఏఐసీసీ కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ..

మునుగోడు ఎప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో మనందరం చూశాం. అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలోకి చేరడం, ఎమ్మెల్యే పదవికి రిజైన్..

Telangana: ఆ ఆడియో నాది కాదు.. నాకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు.. ఏఐసీసీ కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ..
Komatireddy Venkat Reddy
Follow us

|

Updated on: Nov 05, 2022 | 12:13 PM

మునుగోడు ఎప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో మనందరం చూశాం. అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలోకి చేరడం, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. ఈ క్రమంలో ఉప ఎన్నిక గురువారం ముగియగా.. మునుగోడు గడ్డపై జెండా ఎగరేసేది ఎవరనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే.. మునుగోడు ఉప ఎన్నికకు ముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వైరల్ అయ్యింది. దీనిపై ఏఐసీసీ సీరియస్ అయింది. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ నాయకుడు జబ్బార్‌తో వెంకటరెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న అందులో మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడైన బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని సూచించినట్టుగా ఉంది.

ఈ వీడియోపై ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్టోబర్ 23 న వెంకటరెడ్డికి ఏఐసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆడియోపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచే ఆయన తన వివరణ పంపినట్టు తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉన్నానని అందులో పేర్కొన్నట్లు సమాచారం. వైరల్ అయిన ఆ ఆడియో తనది కాదని, నకిలీదని వివరణ ఇచ్చిట్లు తెలుస్తోంది.

“అది ఫేక్ ఆడియో. ఆ వాయిస్ నాది కాదు. మార్ఫింగ్ చేసింది. పార్టీలో నేను చాలా సీనియర్ నేతను. విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నా. నా సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన సమాధానం పట్ల ఏఐసీసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని మునుగోడు వార్తల కోసం