AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 2100 కోట్లు.. ప్రధాని మోదీ, కేంద్రానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు..

Telangana: తెలంగాణ అభివృద్ధి కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2000 కోట్ల సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రీజినల్‌..

Kishan Reddy: తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 2100 కోట్లు.. ప్రధాని మోదీ, కేంద్రానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు..
Kishan Reddy; PM Modi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 28, 2023 | 8:27 PM

Share

Telangana: తెలంగాణ అభివృద్ధి కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2000 కోట్ల సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్‌కు కేంద్రం పచ్చజెండా ఊపిందని బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరోగ్య, రవాణా, ఇన్ఫ్రా అభివృద్ధి కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్రం ఇప్పటివరకు రూ. 2100 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా కిషన్ రెడ్డి విడుదల చేశారు.

కిషన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం మిషన్ భగిరథ రెండో దశలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల్లో నీటి సరఫరా కోసం రూ. 200 కోట్లు.. ఎమ్ఎల్‌డీ-ఎస్‌టీపీల నిర్మాణం కోసం మరో రూ. 200 కోట్లు.. కోట్లు.. వరంగల్, కరీంనగర్ అభివృ‌ద్ధి కోసం 200 కోట్లు.. ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ కోసం రూ.100.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని టీచించ్ హాస్పిటల్ కోసం రూ.75 కోట్లు.. ఇలా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 50 ఏళ్లకు వడ్డీ లేని రూ. 2102 కోట్ల రుణం అందించింది.

ఇంకా, రూ. 26 వేల కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్న 350 కి.మీల ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు రాష్ట్రంలోని చాలా జిల్లాలను అనుసంధానం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు వివరాలన్నీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అందించామని, రూట్ విషయంలో 99 శాతం ఆమోదం లభించిందని.. భూసేకరణ ఖర్చులో 50 శాతం కేంద్రమే భరించేందుకు అంగీకరించిందని తెలిపారు. అలాగే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు సర్వే త్వరలో ప్రారంభం అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లను రాష్ట్రం కేటాయించిందని, భూసేకరణ పనులను వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆర్‌ఆర్‌ఆర్‌ వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ వలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ వలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది