World Cup 2023: భారత్ ముందు కుప్పిగంతులా..? మెగాటోర్నీ ఆడేందుకు పాకిస్థాన్ సమ్మతి..
IND vs PAK, ODI WC 2023: భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ జట్టు ఇండియాకు వస్తుందా లేదా..? అనేదే ఇప్పటివరకు పెద్ద చర్చగా మారింది. అయితే వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ..
IND vs PAK, ODI WC 2023: భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ జట్టు ఇండియాకు వస్తుందా లేదా..? అనేదే ఇప్పటివరకు పెద్ద చర్చగా మారింది. అయితే వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ మంగళవారం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చర్చకు తెర పడింది. వన్డే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వస్తుందని అందరికిీ సుస్పష్టం అయిపోయింది. అంతకముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సృష్టించిన if-but పరిస్థితి కూడా తొలగిపోయింది. అలాగే పాకిస్థాన్ మొండితనం, దురహంకారం దోరణి వంటివన్నీ కూడా భారత్ ముందు పటాపంచలైపోయాయి. ఏదిఏమైనా భారత్ ముందు పాకిస్థాన్ ఓ అడుగు వెనక్కు వేయకతప్పలేదు.
భారత్ వేదికగా 46 రోజుల పాటు జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 కోసం మంగళవారం వరకు కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్టాండ్ ఏమిటనే విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే బీసీసీఐపై పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు, బోర్డు సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ఎప్పటికప్పుడు ఇష్టానుసారం మాట్లాడారు. చివరాఖరకు భారత్ ముందు తన పప్పులు ఉడకవని తెలుసుకున్న పాక్ బోర్డు ఉపఖండంలోనే ప్రపంచకప్ ఆడేందుకు సమ్మతి తెలిపింది.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men’s @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
— ICC (@ICC) June 27, 2023
భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ అభ్యంతరమెందుకు..?
పాకిస్థాన్ వేదికగా మరో రెండు నెలల్లో ఆసియా కప్ జరగనుంది. అయితే పాక్ వేదిగా టోర్నీ ఆడేందుకు భారత్ నిరాకరించింది. 2008 ముంబై దాడుల నేపథ్యంలో దాయాది దేశంతో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు, అక్కడ జరిగే టోర్నీలకు భారత్ అడ్డుచెబుతూనే ఉంది. తమ దేశానికి ఆసియా కప్ టోర్నీ కోసం భారత్ రాకపోతే.. తాము ప్రపంచకప్ కోసం ఇండియాకు రామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మొండితనం ప్రదర్శించింది. ఈ క్రమంలోనే ఆసియాకప్‌లో భారత్ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు సుదీర్ఘ చర్చల తర్వాత అన్ని దేశాల జట్లతో పాటు భారత్ కూడా సమ్మతం తెలిపింది. ఫలితంగా భారత్‌తో జరిగే అన్ని మ్యాచ్‌లు మినహా మొత్తం మ్యాచ్‌లు పాక్ వేదికగా జరుతుతాయి. భారత్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.
అయితే ప్రపంచకప్ టోర్నీ కోసం తాము రావాలంటే భారత్ తమ దేశానికి వస్తేనే సాధ్యమంటూ కుప్పిగంతులు వేసింది. అలాగే తాము భారత్ రావాడానికి కావాల్సిన నిర్ణయం తమ ప్రభుత్వ పరిథిలోని విషయంటూ కొత్త చర్చకు తెరలేపింది. కానీ భారత్ ఎక్కడా తలొగ్గకపోవడంతో పాకిస్థాన్ నిలవలేక బీసీసీఐ దారిలోకే వచ్చింది. దీంతో భారత్ వేదిగా ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. అది నేడు విడుదలైన వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ షెడ్యూల్ తర్వాత స్పష్టమయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..