IND vs WI: ‘నిర్ణయం సరైనదే కానీ అవకాశం చేజారింది..!’ రహానే వైస్ కెప్టెన్సీపై సన్నీ స్పందన ఏమిటంటే..
Sunil Gavaskar: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడిన తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారత్ తన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఇక జూలై 12 నుంచి ప్రారంభయ్యే ఈ టూర్ కోసం..
Sunil Gavaskar: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడిన తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారత్ తన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఇక జూలై 12 నుంచి ప్రారంభయ్యే ఈ టూర్ కోసం బీసీసీఐ ఇప్పటికే టెస్ట్, వన్డే జట్టులను ప్రటించింది. ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ భారత జట్టును నడిపిస్తుండగా.. టెస్టుల్లో అజింక్యా రహానె, వన్డేలకు హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. అయితే టెస్టులో రహానేని వైస్ కెప్టెన్‌గా నియంమించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భారత సెలెక్టర్లను ప్రశ్నించాడు.
‘‘వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు రహానే వైస్ కెప్టెన్‌గా ఉండటంలో తప్పు లేదు, కానీ ఓ యువ ఆటగాడిని తీర్చిదిద్దే అవకాశం చేజారింది. కనీసం ఇప్పటికైనా ‘మేము నిన్ను భవిష్యత్ కెప్టెన్‌గా చూస్తున్నామ’ని ఆ యువ ఆటగాళ్లకి చెప్పండి. ఫలితంగా వారు ఇప్పటినుంచే సారథిగా ఉండడంపై ఆలోచించడం ప్రారంభిస్తారు. భవిష్యత్ కెప్టెన్‌లుగా శుభమన్ గిల్, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. అక్షర్ ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగ్గా ఆడుతున్నాడు. అక్షర్‌కి వైస్ కెప్టెన్‌గా బాధ్యత ఇవ్వడం అతన్ని ఆలోచింపజేస్తుంది. నా దృష్టిలో విరిద్దరూ కాకుండా, ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాడు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగితే కెప్టెన్‌గా తీసుకునేందుకు లెక్కలోకి రాగలడు’’ అని సన్ని అన్నాడు.
విండీస్ టూర్ కోసం ఎంపికైన భారత ప్లేయర్లు..
NEWS – India’s squads for West Indies Tests and ODI series announced.
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
— BCCI (@BCCI) June 23, 2023
కాగా, ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో లండన్ వేదిగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన రహానే రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(89, 46) మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఈ కారణంగానే బీసీసీఐ అతన్ని విండీస్ టూర్ కోసం టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా నియమించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..