Upcoming Cars 2023: విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్న టాప్ 7 ఎస్‌యూవీలు.. మారుతి సుజుకి నుంచి టాటా వరకు..

Upcoming Cars 2023: గత కొంత కాలంలో భారతదేశంలో SUV కార్లకు క్రమక్రమంగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే మారుతీ, టాటా, హోండా వంటి పలు ఆటో కంపెనీలు తమ కొత్త ఎస్‌యూవీలను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సంవత్సరంలోనే అతి త్వరలో భారత్ మార్కెట్‌లోకి రాబోతున్న ఎస్‌యూవీలేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 27, 2023 | 2:39 PM

Maruti Suzuki Invicto: మారుతి సుజుకి నుంచి రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధరతో వస్తున్న మొదటి కారు ఇదే. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా ఈ ఎమ్‌పీవీ కారును మారుతి సుజుకి త్వరలో విడుదల చేయవచ్చు. ఈ కారులో దృఢమైన హైబ్రిడ్ ఇంజన్ సపోర్ట్ ఉంటుంది. రూ. 25,000 నుంచి మీరు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు.

1 / 7
Honda Elevate: హోండా కంపెనీ ఇటీవల ఎలివేట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది హ్యుందాయ్ క్రెటా,  కియా సెల్టోస్ వంటి ఇతర SUVలతో పోటీపడేందుకు మార్కెట్‌లోకి త్వరలో రాబోతుంది. హోండా లైనప్‌లో చాలా తక్కువ కార్లు ఉన్న నేపథ్యంలో ఈ కారుపై చాలా అంచనాలు ఉన్నాయి.

2 / 7
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ తన కొత్త మైక్రో-ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ను  భారత మార్కెట్‌లోకి జూలై 10న విడుదల చేయబోతుంది. ఇది దేశంలోని ప్రముఖ మైక్రో-ఎస్‌యూవీ అయిన టాటా పంచ్‌తో పోటీపడేందుకు సిద్ధంగా ఉంది. 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో పనిచేయనున్న ఈ ఎక్స్‌టర్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో రాబోతుంది. ఇక ఈ ఎస్‌యూవీ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయింది.

3 / 7
Citroen C3 Aircross: సిట్రోయెన్ ఆటో కంపెనీ నెమ్మదిగా భారత్‌లో పాగా చేయడానికి అడుగులు వేస్తోంది. ఇప్పటికే C3 మోడల్‌ని విడుదల చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఎయిర్‌క్రాస్ వెర్షన్‌ను పరిచయం చేయబోతుంది. సీ3 ఎయిర్‌క్రాస్ మోడల్ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే భారత్‌లో కూడా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

4 / 7
Kia Seltos Facelift: భారత్‌లో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయిస్తున్న ఆటో కంపెనీలలో కియా సెల్టోస్ కంపెనీ కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే తన మార్కె‌ట్‌ను మరింత పెంచుకోవాలనే దిశగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది కియా సెల్టోస్. గ్లోబల్ మార్కెట్‌లో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే విడుదలైంది. త్వరలో  భారత్‌లోకి కూడా రాబోతుంది.

5 / 7
Tata Harrier Facelift: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ SUVలో టాటా హారియర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తన ప్రజాదరణను మరింతగా ఉపయోగించుకోవడానికి హారియర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా త్వరలో రాబోతుంది.

6 / 7
Tata Safari Facelift: టాటా కంపెనీ హారియర్‌తో పాటు సఫారి SUVకి కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొస్తుతుంది. సఫారి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సరికొత్త ఫీచర్లు, ADAS టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది. 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చనే అంచనాలు ఉన్నాయి.

7 / 7
Follow us
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!