Bandi Sanjay: అవును.. ఇవన్ని చెప్పించేది ఆయనే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు తెలుసన్నారు. లీకులు ఇచ్చే వారిపై అధిష్టానానికి పిర్యాదు చేస్తామన్నారు. లీకులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరే.. ఆయన పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం..

బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ స్పందించారు. టీ బీజేపీ అధ్యక్ష మార్పు కేవలం ఊహాజనితమే అని ఆయన కొట్టిపారేశారు. అధ్యక్ష మార్పుపై నడ్డా ఏం చెప్తే అది చేస్తామన్నారు. లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు తెలుసన్నారు. లీకులు ఇచ్చే వారిపై అధిష్టానానికి పిర్యాదు చేస్తామన్నారు. లీకులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరే.. ఆయన పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం కేసీఆర్‌కు అలవాటుగామారిందన్నారు. ఈటల రాజేందర్‌కు భద్రత ఇవ్వాల్సిందే అని అన్నారు. ఈటల రాజేందర్ హత్య చేస్తామన్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ భద్రత ఇష్యూ పై మంత్రి కేటీఆర్ స్పందించాడని.. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
నాపై దాడులు జరిగాయి.. రాజసింగ్ పై దాడులు జరిగాయి.. ధర్మపురి అర్వింద్ దాడి జరిగిందని అన్నారు. తమ పార్టీ నేతలపై దాడులు చేసి, కుట్రపన్నిన వ్యక్తులను విడిచిపెట్టి మాపై కేసులు పెట్టారు. జైళ్లలుకు పంపించారని మండిపడ్డారు.
సుపారీ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంకా బయట తిరుగుతున్నాడని.. హత్య చేస్తానన్న వ్యక్తి బహిరంగంగా ప్రెస్‌మీట్ ఎలా పెడతాడని అన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని అన్నారు. అందరికీ భద్రత కల్పించాల్సిందే అని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
