Big News Big Debate: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ఎన్నికల వ్యూహాలపై అధిష్టానం ఫోకస్.. లైవ్ వీడియో
భారతీయ జనతా పార్టీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారంరోజులుగా హైకమాండ్ రాష్ట్ర పార్టీలోని అంతర్గత సంక్షోభాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. నాయకత్వ మార్పులతో పాటు.. కొత్తవారికి కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అటు మోదీ కూడా మధ్యప్రదేశ్ నుంచి కేసీఆర్‌ను టార్గెట్..
భారతీయ జనతా పార్టీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారంరోజులుగా హైకమాండ్ రాష్ట్ర పార్టీలోని అంతర్గత సంక్షోభాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. నాయకత్వ మార్పులతో పాటు.. కొత్తవారికి కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అటు మోదీ కూడా మధ్యప్రదేశ్ నుంచి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ శంఖారావం పూరించారు. మరోవైపు ఈటల హత్యకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది.. అటు ఎన్నికల వ్యూహాలపై అధిష్టానం కూడా దృష్టిసారించింది.కేడర్‌కు దిశానిర్దేశం చేస్తూ వచ్చిన ఢిల్లీ నాయకత్వం అసమ్మతులను బుజ్జగిస్తోంది. SPOT ఇందులో భాగంగా పార్టీ చీఫ్‌ను మార్చి.. కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ. కుల సమీకరణలు.. పాత, కొత్త నాయకుల సమన్వయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మరీ నాయకత్వంలో మార్పులు చేయాలనుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించిన జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్‌షాలు రోడ్‌మ్యాప్ సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుంచారు. పీఎం ఆమోదముద్ర పడితే రాష్ట్ర పార్టీలో మార్పులు ఏక్షణమైనా ప్రకటించే అవకాశముంది.