Telangana: 12 ఏళ్ల వయస్సులో తప్పిపోయి.. 28 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చాడు.. సీన్ కట్ చేస్తే..!

చిన్నప్పుడు తప్పిపోయిన ఓ వ్యక్తి 28 సంవత్సరాల తరువాత 40 ఏళ్ల వయస్సులో కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ వచ్చి స్వగ్రామానికి చేరాడు. అతనిని చూసి షాక్‌కు గురయ్యారు కుటుంబ సభ్యులు. ఇక తిరిగిరారని అనుకున్నారు..

Telangana: 12 ఏళ్ల వయస్సులో తప్పిపోయి.. 28 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చాడు.. సీన్ కట్ చేస్తే..!
Telugu News
Follow us
G Sampath Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2024 | 10:42 AM

చిన్నప్పుడు తప్పిపోయిన ఓ వ్యక్తి 28 సంవత్సరాల తరువాత 40 ఏళ్ల వయస్సులో కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ వచ్చి స్వగ్రామానికి చేరాడు. అతనిని చూసి షాక్‌కు గురయ్యారు కుటుంబ సభ్యులు. ఇక తిరిగిరారని అనుకున్నారు.. అంతేకాదు.. ఆయనను మర్చిపోయారు కూడా. 28 ఏళ్ల తరువాత ఇంట్లో అడుగు పెట్టడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఎవరాయన.? ఎలా మిస్ అయ్యారు.? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో కచ్చు బక్కయ్య-బక్కవ్వలకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు కొమరయ్య, చిన్న కుమారుడు మల్లయ్యలతోపాటు ఓ కుమార్తె ఉండగా.. చిన్న కుమారుడు మల్లయ్య 14 ఏళ్ల వయసులో ఉండగా తల్లి బక్కవ్వ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందింది. మృతి చెందిన తల్లిని చూడడానికి వెళ్లిన మల్లయ్య కన్నీరు మున్నీరయ్యాడు. ఈ క్రమంలోనే మల్లయ్యకు తీవ్రంగా దాహం వేయడంతో నీరు తాగేందుకు వచ్చి.. త్రోవ తప్పిపోయాడు. చేసేదేమీ లేక వరంగల్ పట్టణంలోని కూలీ పని చేస్తండగా అధికారులకు పట్టుబడ్డాడు. కొన్ని రోజులు బాల నేరస్తుల జైలులో ఉన్నాడు. అనంతరం వరంగల్ పట్టణంలోని పూల వ్యాపారి వద్ద పనికి కుదిరాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే మల్లయ్య చిన్నప్పటి నుంచి తన వద్దే ఉండడంతో అ పూల వ్యాపారి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయగా తనకు ఒక కొడుకు జన్మించాడు. ఇలా కొన్ని రోజులు గడవగా తనకు తన కుటుంబ సభ్యులు చూడాలని ఆశ మొదటి నుంచి ఉన్నప్పటికీ రాలేని పరిస్థితి అతనిది, ఇప్పటికైనా తన కుటుంబ సభ్యులను కలవాలని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే రాడనుకున్న మల్లయ్య తన కుటుంబ సభ్యుల వద్దకి రావడంతో కుటుంబ సభ్యులు అనందపడ్డారు.

తాను తన కుటుంబ సభ్యులను కలవడం ఎంతో సంతోషకరంగా ఉందని మల్లయ్య అన్నాడు. తాను బాల్యంలో ఉండగా తన తల్లి మృతి చెందిందని ఆ సందర్భంలోనే వస్తాననుకున్నానని ఇక్కడికి వస్తే తన కుటుంబ సభ్యులు ఏమంటారో అనే భయంతో ఇక్కడికి రాలేదని వాపోయారు. ఇక నుంచి తాను తన గ్రామంలోనే ఉంటానని చెప్పాడు. మల్లయ్య అన్న కోమరయ్య కూడా తన తమ్ముడు ఇక రాడనుకున్నానని ఇన్ని రోజులకు తన తమ్ముడు రావడం చాలా సంతోషంగా ఉందని, తన తమ్ముడికి అన్ని విధాల తోడు ఉంటానని తెలిపారు.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..