గతేడాది కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో రూ. 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన 6,600 బంగారు కడ్డీల దోపిడీ కేసులో కెనడా పోలీసులు అర్సలాన్ చౌదరిని అరెస్టు చేశారు. దుబాయ్ నుండి రాగానే అతడిని పట్టుకున్నారు. అయితే, ఈ కేసులోని కీలక నిందితుడు సిమ్రన్ ప్రీత్ ప్రస్తుతం భారత్లో ఉన్నట్లు సమాచారం. ఈ దొంగతనంపై దర్యాప్తు కొనసాగుతోంది.