AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. కారణం ఇదే..!

ఓ విద్యార్థి ఖమ్మం మెడికల్ కాలేజ్‌లో ప్రథమ సంవత్సరం చదువుతూ హాస్టల్ లో ఉంటున్నాడు. ఇతని హెయిర్ స్టైల్ విషయంలో విద్యార్థులు మధ్య ఘర్షణ తలెత్తిందని తెలుస్తోంది.

మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. కారణం ఇదే..!
Khammam Medical College
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 17, 2024 | 10:17 AM

Share

మొదటి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించాడు..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ముగ్గురితో విచారణ కమిటీ వేయడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం మెడికల్ కాలేజ్‌లో ప్రథమ సంవత్సరం చదువుతూ హాస్టల్ లో ఉంటున్నాడు. ఇతని హెయిర్ స్టైల్ విషయంలో విద్యార్థులు మధ్య ఘర్షణ తలెత్తిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరుగుతున్నట్లు ప్రిన్సిపల్‌ తెలిపారు.

ఖమ్మం మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతూ.. మెడికల్ కాలేజ్‌ హాస్టల్ లో ఉంటున్నాడు. నవంబర్‌ 12వ తేదీ రాత్రి హెయిర్‌ కటింగ్‌ చేయించుకున్నాడు. ఇతను హెయిర్ చెవుల వరకు చైనీస్ స్టైల్లో కటింగ్ చేయించుకుని హాస్టల్ కు వచ్చాడు.

ఆ కటింగ్ చూసిన సెకండ్ ఇయర్ మెడికల్ కళాశాల విద్యార్థులు ఇలా ఉండటం బాగాలేదని చెప్పడంతో తిరిగి వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుని వచ్చాడు. హాస్టల్‌లో యాంటీ రాగింగ్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్.. విద్యార్థి కటింగ్ విషయాన్ని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ విద్యార్థిని బయటికి తీసుకెళ్లి సెలూన్ షాప్ లో గుండు గీయించారు. ఈ ఘటనపై మనస్తాపం చెందిన విద్యార్థి ప్రిన్సిపాల్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఫిర్యాదు చేశాడు.

జరిగిన విషయం వాట్సప్ గ్రూపులో ఫిర్యాదు రావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాంటీ రాగింగ్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ను ఈనెల 13న అక్కడి విధులు నుంచి తప్పించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై నివేదికను డీఎంఈకి పంపించనున్నట్లు తెలిపారు. ఘటన నిజమేనని, బాధ్యుడిని తొలగించినట్లు ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. జరిగిన ఘటన పై ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించారు.

విద్యార్థికి గుండు కొట్టించిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సరిత, అనస్తీషియా డాక్టర్ రవి, డాక్టర్ రాజీవ్ ను విచారణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో వీరు సంఘటనపై విచారించి నివేదిక అందించాలని సూచించారు. నివేదిక తర్వాత బాద్యులపై కఠినచర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..