AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Green Peas : రూ. 10 కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.. నకిలీ బఠానీలను ఇలా గుర్తించండి!

రైలులోనో, బస్సులోనో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ దగ్గర కూర్చుని పచ్చి బఠానీలు తినడం చాలామందికి ఇష్టం. రూ. 10 లేదా 20లకే లభించే ఈ చిరుతిండి ఆరోగ్యకరమని మీరు భావిస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే! ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోయే ఈ బఠానీలు అసలైనవి కావు. తక్కువ రకపు పసుపు బఠానీలకు ప్రమాదకరమైన ఇండస్ట్రియల్ రంగులు పూసి అమ్ముతున్న వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ బఠానీల వెనుక ఉన్న ప్రమాదకరమైన నిజాలు ఇక్కడ ఉన్నాయి.

Fake Green Peas : రూ. 10 కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.. నకిలీ బఠానీలను ఇలా గుర్తించండి!
Fake Green Peas Chemical Colors
Bhavani
|

Updated on: Jan 14, 2026 | 5:41 PM

Share

చౌకగా దొరుకుతున్నాయని మీరు కొనే స్నాక్స్ మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయా? ఇటీవల మార్కెట్లోకి వస్తున్న నకిలీ పచ్చి బఠానీలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బట్టలకు వేసే రంగులు, హానికరమైన రసాయనాలతో తయారవుతున్న ఈ ‘టైమ్-పాస్’ ఫుడ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బఠానీకి, రంగు వేసిన నకిలీ బఠానీకి ఉన్న తేడా ఏంటి? మనం ఎలా జాగ్రత్త పడాలి? తెలుసుకోండి.

నకిలీ బఠానీల వెనుక ఉన్న అసలు సీక్రెట్

మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడవుతున్న ఈ పచ్చి బఠానీలు నిజానికి సహజమైనవి కావు. విక్రేతలు తక్కువ ధరకి లభించే పసుపు బఠానీలను తీసుకుంటారు. వాటిని ఆకర్షణీయంగా మార్చడానికి కృత్రిమ ఆకుపచ్చ రంగులను (అందులోనూ బట్టలకు వేసే రంగులు) ఉపయోగిస్తారు. వీటిని నూనెలో వేయించి, ఉప్పు కలిపి ప్యాకెట్లలో ప్యాక్ చేసి రైళ్లు, బస్సుల్లో విక్రయిస్తారు.

నిజమైన vs నకిలీ బఠానీలు: తేడా ఏంటి?

రంగు: అసలైన పచ్చి బఠానీలు సహజమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి, అవి మరీ ముదురు రంగులో మెరిసిపోవు. నకిలీవి చూడగానే కంటికి విపరీతమైన రంగుతో కనిపిస్తాయి.

నీటిలో పరీక్ష: ఈ బఠానీలను కొద్దిసేపు నీటిలో వేస్తే, నకిలీవి వెంటనే రంగును వదులుతాయి. నీరు పచ్చగా మారిపోతుంది.

ధర: సహజమైన పచ్చి బఠానీలు ప్రాసెస్ చేయడం ఖరీదైన పని. రూ. 5 లేదా 10 కి లభించే ప్యాకెట్లు నకిలీవని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఆరోగ్యానికి కలిగే ముప్పు

పరిశోధకుల ప్రకారం, ఈ రసాయన రంగులు వాడటం వల్ల:

జీర్ణ సమస్యలు: కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు సంభవిస్తాయి.

టాక్సిన్స్: శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోయి కిడ్నీలు, కాలేయంపై ప్రభావం చూపుతాయి.

క్యాన్సర్: దీర్ఘకాలంలో ఇండస్ట్రియల్ రంగుల వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

పిల్లలపై ప్రభావం: ఇది పిల్లల ఎదుగుదల రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు.