Hyderabad: దారుణం.. మరో వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా.. ఇకనైనా మారండి బ్రదర్..
చైనా మాంజా దారాలు కోసుకుపోతూ.. జనాల ప్రాణాలమీదకు వస్తున్నాయి. కొన్నిరోజులుగా వాహనదారుల పీకల మీదకు వస్తున్నాయి చైనా మాంజా దారాలు. తాజాగా.. ఓ బైకర్ ను బలి తీసుకుంది.. సంగారెడ్డి ఫసల్వాదిలో చైనా మాంజా చుట్టుకుని.. ఓ వ్యక్తి మరణించాడు.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా చుట్టుకుని గొంతు కోసుకుపోయింది..

చైనా మాంజా దారాలు కోసుకుపోతూ.. జనాల ప్రాణాలమీదకు వస్తున్నాయి. కొన్నిరోజులుగా వాహనదారుల పీకల మీదకు వస్తున్నాయి చైనా మాంజా దారాలు.. చైనా మాంజాను వాడొద్దు అని పోలీసులు పదేపదే చెబుతున్న.. వివిధ షాపుల పై దాడులు చేస్తూ.. కేసులు పెడుతున్నా.. కూడా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు.. ఈ మంజాను వాడడం వల్ల ఎంతో మంది గాయాలపాలు అవ్వడమే కాకుండా.. మరి కొంతమంది మృత్యువాత పడుతున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ వేళ ఈ మాంజా దారం వల్ల కొన్ని కుటుంబాల్లో తీరని శోకం మిగులుతుంది.
తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ఘటన అందరిని కలిచి వేసింది. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో చైనా మంజా మెడకు కోసుకుపోయి ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. మృతుడు బీహార్ కు చెందిన అద్వైక్ గా గుర్తించారు పోలీసులు.. బైక్ పై సంగారెడ్డి సైడ్ వస్తుండగా తెగిన మాంజా దారం అతని గొంతు వద్ద కోసుకుపోయింది..
బైక్ స్పీడ్ గా ఉన్న నేపథ్యంలో గాయం పెద్దగా అయ్యి.. తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు.. కాగా అద్వైక్ పసల్వాది లో ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు.. అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు… ఇలా మాంజా దారం వల్ల ప్రమాదాలు జరుగుతూ మృతి చెందిన కూడా కొంతమంది ఇంకా వాటిని వాడుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇకనైనా మారండి..
పతంగుల పండగ నేపథ్యంలో చాలా చోట్ల పంతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారంరోజులుగా చూస్తున్న ఘటనలు మనసులను కలచివేస్తున్నాయి. చాలా మంది చైనా మాంజాలతో అల్లాడిపోతున్నారు. చైనా మాంజా దారాలు కోసుకుపోతూ.. జనాల ప్రాణాలమీదకు వస్తున్నాయి.. మొన్న ఓ బైకర్ చేయి తీసేసినంత పనైంది. నిన్న ఉప్పల్‌లో ఓ ASI మెడకు చుట్టుకోవడంతో ఆయన గొంతు కట్ అయింది. అల్మాస్‌గూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి కాలికి చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. 70శాతం కాలు తెగిపోయింది. ఇటీవల గచ్చిబౌలిలో చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హాస్పిటల్ పాలయ్యాడు. ఇలా వరుస ఘటనలు సామాన్యులను.. ముఖ్యంగా వాహనదారులను కలవరపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇకనైనా చైనా మాంజా లు ఉపయోగించకుండా మారాలంటూ సూచిస్తున్నారు పోలీసులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
