హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చేసింది.. భారత్ ఏ ప్లేస్‌లో ఉంది? పాకిస్థాన్ స్థానం ఎంతంటే?
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల హెన్లీ ఇండెక్స్ 2024 విడుదలైంది. ఈ జాబితాలో భారత్ ఐదు స్థానాలు మెరుగుపడి 80వ ర్యాంక్‌ను సాధించింది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు 55 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్‌తో ప్రయాణించవచ్చు.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల కొత్త జాబితా విడుదల అయింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 వివిధ దేశాల పాస్‌పోర్ట్‌ల బలాన్ని అంచనా వేస్తుంది. ఈసారి భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ మెరుగుపడింది. మునుపటి ర్యాంకింగ్‌తో పోలిస్తే భారత్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుంది. కానీ భారత్ ఇప్పుడు అగ్రరాజ్యాలతో అన్ని విషయాల్లో పోటీ పడుతుంది కనుక, వాటితో పోల్చుకుంటే మాత్రం చాలా వెనుకబడి ఉంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. గత సంవత్సరం భారత్ 85వ స్థానంలో ఉంది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్‌తో 55 దేశాలకు ప్రయాణించవచ్చు.
2025లో భారత్ 85వ స్థానంలో ఉన్న సమయంలో ఇండియన్ పాస్‌పోర్ట్‌లతో 57 దేశాలకు వీసా-రహిత లేదా ఇ-వీసా ప్రవేశం లభించింది. 2024లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. ఈసారి ప్రపంచంలోనే అత్యంత బలమైన పాస్‌పోర్ట్‌లు ఆసియా నుంచే ఉన్నాయి. సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, జపాన్, దక్షిణ కొరియా రెండవ స్థానంలో ఉన్నాయి. సింగపూర్ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. జపాన్, దక్షిణ కొరియా పౌరులు 188 దేశాలలో ఈ ప్రత్యేక హక్కును కలిగి ఉన్నారు.
డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, లక్సెంబర్గ్ మూడవ స్థానాన్ని పంచుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు 186 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఈ యూరోపియన్ దేశాల బలమైన దౌత్యం, స్థిరమైన విధానాలు వాటి ర్యాంకింగ్‌లలో ప్రతిబింబిస్తాయి. ఈసారి UAE అనూహ్యంగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది, ఐదు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. 2026 నుండి UAE 149 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని పొందింది. గతసారి టాప్ 10 నుండి తప్పుకున్న అమెరికా ఈసారి తిరిగి 10వ స్థానానికి చేరుకుంది.
బలహీనమైన పాస్‌పోర్ట్‌లు
ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ అత్యల్ప స్థానంలో ఉంది, 191వ స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ పాస్‌పోర్ట్ 24 దేశాలకు మాత్రమే వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది. పాకిస్తాన్ కూడా 98వ స్థానంలో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
