ఇకపై 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ సేవలు ఉండవు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించాయి. జెప్టో, ఇన్స్టామార్ట్, స్విగ్గీ కూడా త్వరలో వీటిని నిలిపివేస్తాయి. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి, వేగంగా డెలివరీ చేయాలనే తపన వల్ల సంభవించే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్య తీసుకున్నారు.