AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ అలర్ట్‌.. పడుకునే ముందు మొబైల్‌ చూస్తున్నారా?

బీ అలర్ట్‌.. పడుకునే ముందు మొబైల్‌ చూస్తున్నారా?

Samatha J
|

Updated on: Jan 14, 2026 | 1:01 PM

Share

పడుకునే ముందు రాత్రి మొబైల్‌ చూసే అలవాటుందా? ఈ అలవాటే వ్యసనంగా మారి నిద్రపట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మొబైల్, లాప్‌టాప్​ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల నిద్ర పట్టకపోవడం లేదా పదేపదే నిద్రలో లేవడం జరుగుతుంది.

రాత్రిపూట చీకటిలో స్క్రీన్ చూడటం వల్ల కళ్లు త్వరగా పొడిబారి అలిసిపోతాయి. మంట, కళ్లు అస్పష్టంగా కనిపించడం జరుగుతాయి. ఎక్కువకాలం ఇదే అలవాటు అయితే కంటి చూపు బలహీనపడుతుంది. సోషల్ మీడియా లేదా ఓవర్ థింకింగ్ కంటెంట్‌ ను రాత్రి సమయంలో చూడటం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. దీనివల్ల నిద్ర పట్టదు. ఇది చికాకు లేదా డిప్రెషన్ ను పెంచుతుంది.చీకటిలో స్క్రీన్ చూడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి మైగ్రేన్, తలనొప్పి వస్తుంది. రాత్రిపూట స్క్రీన్ చూడటం వల్ల ఆలస్యంగా నిద్రపోయే అలవాటు మొదలవుతుంది. ఇది నిద్రలేమికి దారి తీసి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. నిద్ర డిస్టర్బ్‌ కావడం వల్ల శరీరంలోని హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఇది మహిళల్లో నెలసరి సమస్యలను పెంచుతుంది. పురుషుల్లో లైంగిక సమస్యలకు కారణమవుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..