ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
సాధారణంగా పాములంటే ఎవరికైనా భయమే. ఇక పాము కాటేస్తే.. ఇంకేమైనా ఉందా.. భయంతో సగం ప్రాణాలు పోతాయి. అయితే ఓ వ్యక్తి తనను పాము కాటేసినా ఏమాత్రం భయపడకుండా ఆ పామును పట్టుకొని నేరుగా ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. ఇందులో కొత్తేముంది..ఇటీవల ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి.. నెట్టింట చూస్తూనే ఉన్నాం అంటారా.. విశేషం ఉంది.. అదేంటంటే. బిహార్‌లోని సాసారామ్‌లోని ఓ ఆసుపత్రిలో ఊహించని పరిణామం జరిగింది.
పాము కరిచిన ఓ వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అతడు ఒక్కడే వెళ్లలేదు.. ఏకంగా 3 నాగుపాములను వెంటతీసుకొని వెళ్లాడు. అయ్యబాబయోయ్..అతన్ని మూడు పాములు కాటేసాయా అనుకోకండి.. కరిచింది ఒక్కటే… ఆ ఒక్కటీ ఏదో తెలియక మూడు పాములను పట్టుకొని వెళ్లాడు. అతడి చేతిలో మూడు నాగుపాములు చూసి వైద్యులు, సిబ్బంది, రోగులు సహా అక్కడున్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, అతడికి పాములను పట్టడంలో నైపుణ్యం ఉందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్ కుమార్ ఇటీవల ఓ ప్రాంతంలో మూడు పాములను రెస్క్యూ చేశాడు. వాటిని అడవిలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లేందుకు బయటకు తీశాడు. ఆ క్రమంలో అందులోని ఓ నాగు గౌతమ్‌ను కాటేసింది.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నేలరాలుతున్న కాకులు..ఏం జరిగింది
రికార్డు స్థాయిలో వేడెక్కిన సముద్రాలు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా
