AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూసీ నిద్రలో కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. సమగ్ర నివేదికపై బీజేపీ నేతల పట్టు

రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు..మూసీబాట పట్టారు. మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులకు అండగా..వారి ఇళ్లలో నిన్న రాత్రి బస చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి..

మూసీ నిద్రలో కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. సమగ్ర నివేదికపై బీజేపీ నేతల పట్టు
Kishan Reddy
Ravi Kiran
|

Updated on: Nov 17, 2024 | 8:26 AM

Share

రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు..మూసీబాట పట్టారు. మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులకు అండగా..వారి ఇళ్లలో నిన్న రాత్రి బస చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి..వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీనిద్రలో భాగంగా అంబర్‌పేటలోని తులసీ రామ్‌నగర్ బస్తీలో పర్యటించిన కిషన్‌రెడ్డి..లక్ష బుల్డోజర్లు తెచ్చినా పేదల ఇళ్లు కూల్చలేరని స్పష్టం చేశారు. బలవంతంగా కూల్చాలని చూస్తే..ఇప్పుడున్న జైళ్లు సరిపోవన్నారు. పేదల ఇళ్లను కూల్చబోమని హామీ ఇస్తే.. మూసీ ప్రక్షాళనకు సహకరిస్తానన్నారు కిషన్‌రెడ్డి.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

రేవంత్‌రెడ్డి ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు..బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌. మూసీనిద్రలో భాగంగా చైతన్యపురిలో నిన్నరాత్రి బస చేశారు..ఈటల రాజేందర్‌. అంతకు ముందు స్థానికులతో రచ్చబండ నిర్వహించారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్ ఎలా చేస్తారన్న ఈటల..ఏ హామీ ఇచ్చి మూసీ ప్రాంతంలో ఇళ్లు కూలుస్తున్నారని ప్రశ్నించారు. మూసీ భూములను కబ్జాచేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ముందు హైదరాబాద్‌లో చెరువులను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు బస్తీ నిద్రలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో వారంతా పర్యటించి.. బాధితులకు భరోసా కల్పించారు. స్థానికులతో రచ్చబండ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

రామంతాపూర్‌ మూసీనిద్రలో NVSS ప్రభాకర్ పాల్గొన్నారు. అంబర్‌పేట్‌ అంబేద్కర్‌నగర్‌ మూసీనిద్రలో మాజీ ఎమ్మెల్యే KS రత్నం, శాస్త్రి నగర్‌లో కృష్ణ యాదవ్‌, అత్తాపూర్ డివిజన్‌లో ప్రేమేందర్ రెడ్డి, ఫిర్జాదిగూడలో మాజీ ఎమ్మెల్సీ రామ్‌చంద్రరావ్‌, రాజేంద్రనగర్‌లో తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చాలని చూస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..