AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

మీరు జన్మించిన తేదీని బట్టి మీ వెనుక దేవతులుంటారని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ తేదీని ఒక దేవుడు లేదా దేవత పాలిస్తుందని నమ్ముతుంటారు హిందువులు. మరి ఆయా తేదీల్లో జన్మించిన వారు విధి ఎలా ఉంది.?

మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా
Representative Image
Ravi Kiran
|

Updated on: Nov 15, 2024 | 10:38 AM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఓ వ్యక్తి పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం బట్టి అతడ్ని జాతకాన్ని అంచనా వేయొచ్చు. అలాగే న్యూమరాలజీ ప్రకారం ఓ వ్యక్తి గుణగణాలు, వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చు. అలాగే మీరు జన్మించిన తేదీని బట్టి మీ వెనుక దేవతులుంటారని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ తేదీని ఒక దేవుడు లేదా దేవత పాలిస్తుందని నమ్ముతుంటారు హిందువులు. మరి ఆయా తేదీల్లో జన్మించిన వారు విధి ఎలా ఉంది.? ఎదుర్కోబోయే సవాళ్లు ఏంటి.? లాంటివి ఇప్పుడు చూద్దాం.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు విష్ణువు మార్గదర్శకత్వంలో ఉంటారని ప్రతీతి. వీరు ఇతరులకు సహాయం చేస్తారని, సహజంగానే నాయకత్వ లక్షణం కలిగి ఉంటారని విశ్వాసం. జీవితంలో బలమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటారని, విష్ణువు వీరికి జ్ఞానం, సహనాన్ని వరంగా ఇస్తారని నమ్ముతుంటారు. ఆయన రక్షణగా ఉంటే మార్గనిర్దేశం చేస్తారంటుంటారు.

ఇవి కూడా చదవండి

2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు పరమశివుడి మార్గదర్శకత్వంలో ఉంటారు. వీరు ఇతరుల పట్ల ఎక్కువ సానుభూతిని చూపిస్తుంటారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటమే కాదు, ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారు. వీరు ఇతరులను ఇట్టే అర్ధం చేసుకుంటారు.

3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు కూడా విష్ణువు మార్గదర్శకంలోనే ఉంటారు. చాలా తెలివైనవారు, వీరిలో ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. ఇతరులపై నమ్మకంగా వ్యవహరిస్తారు. అలాగే వీరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో ఉపయోగించే తెలివి, సామర్ధ్యం.. ఇతరులను ఆకట్టుకుంటుంది.

4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు విఘ్నాలు తొలగించే వినాయకుడి మార్గదర్శకత్వంలో ఉంటారని ప్రతీతి. ప్రతీ అడ్డంకిని చాలా తెలివిగా తప్పించుకోగలరు. ఆచారణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంటారు. మంచి మాటకారులు, దేనికి అస్సలు భయపడరు.

5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళను ఇద్దరు దేవళ్లు సంరక్షిస్తారట. ఒకరు వినాయకుడు అయితే మరొకరు శ్రీరాముడు. వీరికి విజయం సాధించే లక్షణాలు ఎక్కువ. రాముడిలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే అడ్డంకుల నుంచి ఎలా తప్పించుకోవలో కూడా తెలుసు.

6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు లక్ష్మీదేవి మార్గదర్శకంలోనే ఉంటారు. ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీరికి జీవితంలో అన్ని దొరుకుతాయి.

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి కూడా వినాయకుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. నాయకత్వపు లక్షణాలు ఉన్న వీరు సమస్యలు పరిష్కరించడంలో నేర్పరులు. ఎక్కువగా ఇతరులతో కలిసి ఉంటారు.

8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి శని దేవుడు మార్గదర్శి. క్రమశిక్షణ, బాధ్యతాయుతం వీరి గుణాలు. కష్టాలను సమర్ధవంతంగా ఎదుర్కుని విజయం వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు.

9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి హనుమంతుడు రక్ష. వీరికి దృఢ సంకల్పం ఎక్కువ, చాలా ధైర్యవంతులు. విశ్వాసంగా ఉంటారు. అంకితభావంతో పని చేస్తారు.

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..