పెరుగు జీర్ణక్రియకు మేలు చేసినా, చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు, ఫ్లూతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు గ్యాస్, అజీర్ణంతో ఇబ్బందిపడవచ్చు. కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు, సైనస్, అలర్జీలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.