AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య భగవానుడి కటాక్షం.. నెల రోజుల్లో వారి కోరికలన్నీ నెరవేరడం పక్కా..!

Sankranthi Astrology 2026: సంక్రాంతి నాడు సూర్య భగవానుడిని ఆరాధించి ఏదైనా కోరిక కోరుకునే పక్షంలో అది నెల రోజుల్లో తప్పకుండా నెరవేరుతుందని జ్యోతిష గ్రంథాలే కాక, పురాణాలు కూడా చెబుతున్నాయి. సూర్యుడు అనుకూలంగా ఉన్న రాశుల వారు సంక్రాంతి నాడు మనసులో ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు తమ మనసు లోని కోరికలు కోరుకోవడం వల్ల సూర్య భగవానుడు ఫిబ్రవరి 13లోగా నెరవేర్చడం జరుగుతుంది. ప్రయత్నం చేయడం మంచిది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 14, 2026 | 6:23 PM

Share
మేషం: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగ సంబంధమైన కోరికలు కోరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం, పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల వంటి విషయాల్లో వీరు కోరుకునే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నెల రోజుల పాటు సూర్య భగవానుడు ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాడు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది బాటపట్టే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారు విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన కోరికలు కోరుకోవడం మంచిది. సంక్రాంతి రోజున ఆదిత్య హృదయం పఠించే పక్షంలో ఫిబ్రవరి 13 లోపల ఈ రాశివారు తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. రవి అనుకూలత వల్ల ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఆశించిన శుభకార్యాలు జరుగుతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల ప్రేమలు, పెళ్లిళ్లు, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, ఆదాయ వృద్ధి, శుభకార్యాలకు సంబంధించిన కోరికలు కోరుకోవడం వల్ల ఇవి తప్ప కుండా నెరవేరే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా రాజీమార్గంలో తప్పకుండా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

3 / 6
తుల: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆస్తిపాస్తులు, గృహం, వాహనం, ఉద్యోగంలో పదోన్నతి వంటి విషయాల్లో సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని ప్రార్థించడం మంచిది. రవి ఈ రాశివారిని అనేక విషయాల్లో బాగా అనుగ్రహించే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. పదోన్నతి కలుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారు ఎక్కువగా ఆదాయ వృద్ధి కోసం, ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సూర్యుడిని ప్రార్థించడం మంచిది. ఈ రాశివారికి రవి భాగ్య స్థానాధిపతి అయినందువల్ల వీరి కోరికలను పూర్తిగా తీర్చే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. జీతభత్యాలు, రాబడి పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం  మెరుగుపడుతుంది.

5 / 6
మీనం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారు ఎక్కువగా సంపన్నుడు కావడం మీద కలలు కంటుంటారు. ఆకస్మిక ధన లాభాన్ని ఆశిస్తుంటారు. ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారా ల్లోనూ శీఘ్ర పురోగతిని కోరుకుంటారు. సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని ప్రార్థించడం వల్ల ఈ రాశివారి కలలు సాకారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి తప్పకుండా షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి.

6 / 6