కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎమోషనల్ పోస్ట్.. అంతలోనే డిలేట్.. ఇంతకీ ఏముందంటే?
కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటన సందర్భంగా సమన్వయ లోపం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ సందర్భంగా సిబ్బందికి విధులు కేటాయించిన అసిస్టెంట్ కరీంనగర్ టౌన్ ఏసీపీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారి, డీఆర్డీఓలకు మెమోలు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ఓ మంత్రి అసహనం వ్యక్తం చేయడంపై రాష్ట్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే ప్రముఖుల పర్యటనలో కలెక్టర్ పమేలా సత్పతితో మంత్రి చేసిన కామెంట్స్, ఆమెను మనోవేదనకు గురి చేస్తున్నట్టుగా పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల టూర్ కావడంతో అన్ని రకాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి పట్ల గన్ మెన్లు వ్యవహరించిన తీరుతో ఆయన కోపం ప్రదర్శించారు. అయితే ఆయన అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ పై మండిపడ్డ తీరును అక్కడున్నవారిని విస్మయ పరిచింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మనోవేధనకు గురైనట్లు సమాచారం.
ఈ మేరకు శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన మనోభావాలను షేర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇంగ్లీష్ కొటేషన్‌ను ఆమె షేర్ చేశారు. అయితే ఇంతలోనే ఏమైందో ఎమో గానీ, పోస్ట్ చేసిన కొద్ది సేపటికే డిలిట్ చేశారు. ఆ పోస్టును బట్టి గమనిస్తే మాత్రం జిల్లా కలెక్టర్ మానసికంగా వేధనకు గురువుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గన్ మెన్లు తప్పి చేసిన విషయంపై తనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలు అన్నారన్న ఆవేదన చెందినట్టుగా జిల్లా కలెక్టరేట్ వర్గాలు చెప్తున్నాయి.
‘నేను స్త్రీని అన్నింటిని తట్టుకుని అందుకు తగినట్టుగా నడుచుకుంటానన్న’ ఉద్దేశ్యంతో ఆమె ఈ పోస్టు చేసి ఉంటారని అంటున్నారు. ‘‘నేను మహిళను, మంట మండగలను.. వికసించగలను.. విరుచుకపడగలను.. మంచులా గడ్డకట్టిపోగలను అవసరమైతే కరిగిపోగలను’’ అంటూ ఇంగ్లీష్ లో ఉన్న కొటేషన్‌ను షేర్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కొద్దిసేపటి తరువాత ఈ పోస్ట్ డిలిట్ కావడంతో ఏ కారణం చేత డిలిట్ చేశారోనన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇకపోతే మంత్రుల పర్యటన సందర్భంగా కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులకు శ్రీముఖాలు అందాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం రాత్రి మెమోలు జారీ చేశారు. శుక్రవారం(జనవరి 24) కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటన సందర్భంగా సమన్వయ లోపం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ సందర్భంగా సిబ్బందికి విధులు కేటాయించిన అసిస్టెంట్ కరీంనగర్ టౌన్ ఏసీపీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారి, డీఆర్డీఓలకు మెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ మెమోలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
