AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇదేంది గురూ.. కోర్టులోనే కోడి వేలం పాట.. ఎంత పలికిందంటే..?

కోడిని వేలం వేయాలని కోర్టు జడ్జి ఆదేశించారు. వెంటనే ఆ వేలంలో పదుల సంఖ్యలో ఆసక్తి ఉన్న వారు పాల్గొన్నారు. అదే సమయంలో వేరే పనిపై కోర్టుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో పాల్గొని ఆ కోడిని 2,300 రూపాయలకు దక్కించుకున్నారు.

Hyderabad: ఇదేంది గురూ.. కోర్టులోనే కోడి వేలం పాట.. ఎంత పలికిందంటే..?
Cock Action
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 26, 2025 | 6:14 PM

Share

ఎన్నో వేలాలు జరుగుతుంటాయి. కానీ కోర్టులోనే వేలం పాట జరగడం ఎపుడైనా చూశారా..? కనీసం విన్నారా.. కానీ ఓ వ్యక్తి కోర్టులో ఓ పందెం కోడిని దక్కించుకున్నాడు ఓ ఘనుడు..! అనుమతి లేకుండా కోడి పందెంలు నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు, జనవరి 25వ తేదీన అత్తాపూర్‌లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. నిందితులతో పాటు పందెం కోడిని సైతం పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే నిందితులకు జరిమానా విధించడంతో పాటు కోడిని ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు న్యాయమూర్తి.

దీంతో సదరు కోడిని వేలం వేయాలని కోర్టు జడ్జి ఆదేశించారు. వెంటనే ఆ వేలంలో పదుల సంఖ్యలో ఆసక్తి ఉన్న వారు పాల్గొన్నారు. అదే సమయంలో వేరే పనిపై కోర్టుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో పాల్గొని ఆ కోడిని 2,300 రూపాయలకు దక్కించుకున్నారు. బంజారాహిల్స్‌లో ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన కోడిని దక్కించుకున్న రామకృష్ణతో పాటు పందెం కోడికి అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌ గౌడ్‌ సత్కరించారు. తనకు మూగ జీవాలు అంటే ఇష్టమని, ఎవరైనా ఈ కోడిని వేలంలో కొనుక్కుంటే ఎక్కడ చంపేసి తినాస్తారేమో అని భయమేసిందన్నారు రామకృష్ణ తాను కూడా వేలంలో పాల్గొని కోడిని దక్కించుకున్నానన్నారు. ఎంత రేటుకైనా దీన్ని కొనుగోలు చేసేవాడినని తెలిపారు. తనకు ఫామ్‌ హౌజ్‌ ఉందని, అక్కడ ఉన్న ఇతర జీవాలతో పాటు దీన్ని కూడా అల్లారుముద్దుగా పెంచుకుంటానని రామకృష్ణ చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..