‘కేటీఆర్‌తో లోకేష్ సరితూగలేరు.. నాయకుడిగా మరింత ఎదగాల్సి ఉంది’: కడియం
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ రాజకీయాలు, తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నేతలపై స్పందిస్తూ.. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, నాయకుడిగా ఆయన మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ రాజకీయాలు, తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నేతలపై స్పందిస్తూ.. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, నాయకుడిగా ఆయన మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలెడ్జ్ వేరని, కేటీఆర్‌తో లోకేష్ అస్సలు సరితూగే అవకాశం లేదని కడియం శ్రీహరి కుండబద్దలు కొట్టారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, ఇక్కడ తెలుగు దేశం పార్టీకి ఎలాంటి స్పేస్ లేదని మాజీమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా క్లోజ్ చేస్తేనే రాష్ట్రంలో తమకు రాజకీయ ఉనికి ఉంటుందని బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే మాత్రం అది కాంగ్రెస్‌కే భారీ అడ్వాంటేజ్‌గా మారుతుందని కడియం వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
