Heavy Rain Alert: నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు జారీ
వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉత్తరాంధ్ర కోస్తా - దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సగటు సముద్రమట్టం నుండి 5.8 కి.మీ ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకి వాలి ఉన్న ఉపరితల చక్రవత ఆవర్తనం. దక్షిణ ఒడిస్సా సమీపంలోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గడ్ ప్రాంతం..

హైదరాబాద్, సెప్టెంబర్ 13: పశ్చిమ మధ్య సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉత్తరాంధ్ర కోస్తా – దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సగటు సముద్రమట్టం నుండి 5.8 కి.మీ ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకి వాలి ఉన్న ఉపరితల చక్రవత ఆవర్తనం. దక్షిణ ఒడిస్సా సమీపంలోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గడ్ ప్రాంతం వైపుగా అల్పపీడనం కదులుతుంది. చత్తీస్‌గడ్ విదర్భల మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిమీ మధ్యలో రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో
ఈ రోజు (సెప్టెంబర్ 13) తెలంగాణ లోని నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్ వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు (సెప్టెంబర్ 14) ఆదిలాబాద్, కొమరం భీం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొ్ంది.
యాదాద్రిలో మూసీ ఉగ్రరూపం.. కాపలా కాస్తున్న పోలీసులు!
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసి లో లెవెల్ బ్రిడ్జి పై నుండి భారీగా మూసి ప్రవహిస్తుంది. దీంతో పోచంపల్లి – బీబీనగర్ మధ్య నిలిచిన రాకపోకలు. ఇరువైపులా భారీ కేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు… వలిగొండ మండలం సంగెం గ్రామం భీమలింగం వద్ద లో లెవెల్ వంతెన పైనుండి భారీగా ప్రవహిస్తున్న మూసి. చౌటుప్పల్ – భువనగిరి మధ్యలో రాకపోకలు బంద్. ఆయా చోట్ల భారీకేడ్లు వేసి పోలీసులు కాపలా కాస్తున్నారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలు, వాహనదారులు, అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసిన పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




