గ్రేటర్ హైదరాబాద్‎లో నీటి కొరత.. వీటికి పెరుగుతున్న ఫుల్ డిమాండ్..

గ్రేటర్ హైదరాబాద్‎లో పెరుగుతున్న ఎండలకు తోడు నీటి ఎద్దడి ఎక్కువ అవుతుంది. దీంతో నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లను ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అమాంతం పెరిగిపోవడంతో టాంకర్ మేనేజ్మెంట్‏పై హైదరాబాద్ జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ట్యాంకర్ బుకింగ్ కూడా పెరిగే అవకాశముందని, అందుకు అనుగుణంగా ట్యాంకర్ల సంఖ్య, ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచుకోవాలని అధికారులకు ఎండి సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్‎లో నీటి కొరత.. వీటికి పెరుగుతున్న ఫుల్ డిమాండ్..
Hyderabad Water Board
Follow us

| Edited By: Srikar T

Updated on: May 02, 2024 | 7:38 PM

గ్రేటర్ హైదరాబాద్‎లో పెరుగుతున్న ఎండలకు తోడు నీటి ఎద్దడి ఎక్కువ అవుతుంది. దీంతో నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లను ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అమాంతం పెరిగిపోవడంతో టాంకర్ మేనేజ్మెంట్‏పై హైదరాబాద్ జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ట్యాంకర్ బుకింగ్ కూడా పెరిగే అవకాశముందని, అందుకు అనుగుణంగా ట్యాంకర్ల సంఖ్య, ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచుకోవాలని అధికారులకు ఎండి సూచించారు. ట్యాంకర్ డెలివరీ సమయాన్ని సాధ్యమైనంత తగ్గించాలని సూచించారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికల ద్వారా వినియోగదారులకు త్వరగా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయవచ్చన్నారు.

ఏప్రిల్ నెలలో మొత్తం 2,37,570 ట్యాంకర్ ట్రిప్పులను వాటర్ బోర్డు డెలివరీ చేశారు. కాగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి 613 ట్యాంకర్లు ఉండగా.. ప్రస్తుతం 840 వరకు పెంచుకున్నట్లు ఎండి తెలిపారు. మరిన్ని ట్యాంకర్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో జలమండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాలపైనా ఎండి సుదర్శన్ రెడ్డి ఆరా తీశారు. సక్రమంగా నడుస్తున్నాయా లేదా, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీసీతో పాటు.. స్థానిక కార్యాలయాల్లో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

ట్యాంకర్ బుకింగ్ విధానం (శాతాల్లో):

వినియోగదారులు వివిధ మార్గాల ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నారు. అందులో మొబైల్ యాప్ ద్వారా 48.96, ఐవీఆర్ఎస్ (కస్టమర్ కేర్) – 36.78, జలమండలి అధికారిక వెబ్ సైట్ ద్వారా 14.16, ఇతర మార్గాల్లో 0.10 శాతం మంది ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు. ఈ సమీక్షలో డైరెక్టర్ ఆపరేషన్స్-1, అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి
Water Supply Details

Water Supply Details

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..