11 Runs off 1 Ball : క్రికెట్ చరిత్రలో వింత..ఒకే బంతికి 11 పరుగులు..రాయ్‌పూర్ టీ20లో ఏం జరిగిందంటే?
11 Runs off 1 Ball : రాయ్‌పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలో ఒకే బంతికి 11 పరుగులు రావడం అంటే ఎవరూ నమ్మలేరు, కానీ రాయ్‌పూర్ మైదానంలో ఇది నిజమైంది.

11 Runs off 1 Ball : రాయ్‌పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలో ఒకే బంతికి 11 పరుగులు రావడం అంటే ఎవరూ నమ్మలేరు, కానీ రాయ్‌పూర్ మైదానంలో ఇది నిజమైంది. కివీస్ బౌలర్ జకారీ ఫౌల్క్స్ వేసిన ఒకే ఒక లీగల్ డెలివరీకి టీమిండియా ఏకంగా 11 పరుగులు దక్కించుకుంది. ఈ వింత ఓవర్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ వింత చోటుచేసుకుంది. కివీస్ యువ బౌలర్ జకారీ ఫౌల్క్స్ బంతిని అందుకున్నాడు. స్ట్రైకింగ్‌లో ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఫౌల్క్స్ వేసిన మొదటి బంతే నో-బాల్ అయింది, దానికి ఇషాన్ ఫోర్ కొట్టాడు (5 పరుగులు). ఆ తర్వాత వేసిన రెండు ప్రయత్నాలు వరుసగా వైడ్లు అయ్యాయి (మరో 2 పరుగులు). అంటే, ఇంకా ఒక్క లీగల్ బంతి కూడా పడకముందే స్కోరు బోర్డు మీద 7 పరుగులు చేరాయి. చివరకు అతను వేసిన మొదటి అఫీషియల్ బంతికి ఇషాన్ కిషన్ మళ్ళీ ఫోర్ కొట్టాడు. వెరసి.. ఒకే ఒక లీగల్ డెలివరీ పూర్తయ్యేసరికి టీమిండియా ఖాతాలో 11 పరుగులు చేరిపోయాయి.
ఈ ఓవర్ అక్కడితో ఆగలేదు. ఫౌల్క్స్ రెండో అఫీషియల్ బంతి వేయడానికి కూడా అతను రెండు ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆ ఓవర్ నాలుగో బంతికి ఇషాన్ మరో ఫోర్, ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తం 10 బంతుల సుదీర్ఘ ఓవర్‌గా మారింది. ఈ ఒక్క ఓవర్‌లోనే భారత్‌కు 24 పరుగులు లభించాయి. బౌలర్ ఫౌల్క్స్ కు ఇది ఒక పీడకల లాంటి అనుభవం కాగా, భారత అభిమానులకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది.
ఆ 10 బంతుల ఓవర్ లెక్క ఇదీ: నో బాల్ + 4 రన్స్, వైడ్, వైడ్, 4 (మొదటి బంతి), వైడ్, 1, 1, 4, 0, 6.
అయితే, ఇంత భారీ ఓవర్ పడినా టీమిండియాకు ఆరంభంలోనే పెద్ద దెబ్బలు తగిలాయి. అంతకుముందు ఓవర్లలోనే ఓపెనర్లు సంజూ శామ్సన్ (6), అభిషేక్ శర్మ (0) అవుట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. కానీ ఇషాన్ కిషన్ ఈ 24 పరుగుల ఓవర్‌తో ఆ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఒకే బంతికి 11 పరుగులు రావడం అనేది టీ20 క్రికెట్‌లో చాలా అరుదుగా జరిగే సంఘటన. రాయ్‌పూర్ ప్రేక్షకులు ఈ వింతను చూసి ఎంజాయ్ చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
