IND Vs NZ: అదిగో పులి వచ్చింది.. కివీస్ సచ్చింది.. 20 ఫోర్లు, 8 సిక్సర్ల విశ్వరూపం.. ఊచకోత మాములుగా లేదుగా
రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన రెండో టీ20లో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయపథంలో నడిపించారు. ఇది టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన 200+ రన్ చేజ్ అని చెప్పొచ్చు.

రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఐకానిక్ విజయాన్ని అందుకుంది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే చేరుకొని టీ20 చరిత్రలో 200+ పరుగులను అత్యంత వేగంగా చేధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు చేశారు టీమ్ మేనేజ్‌మెంట్. అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రానా, బుమ్రాకు విశ్రాంతినిచ్చి కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్ కూడా మార్పులతో బరిలోకి దిగింది. టిమ్ సైఫర్ట్, మ్యాట్ హెన్రీ, జాకరీ ఫౌల్క్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఓపెనింగ్‌లో న్యూజిలాండ్ బలమైన బ్యాటింగ్ చేసింది. మొదటి మూడు ఓవర్లలోనే ఆ జట్టు బ్యాటర్లు అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని 43 పరుగులు రాబట్టారు. అయితే, హర్షిత్ రానా తన అరంగేట్రం ఓవర్‌లోనే డెవాన్ కాన్వే వికెట్ తీసి బ్రేక్‌త్రూ అందించాడు. ఆ వెంటనే టిమ్ సైఫర్ట్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయడంతో కివీస్ తడబడింది.
ఇది చదవండి: ‘అలా అనుకుంటే ఎన్టీఆర్‌ను అడ్డంపెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని..’
రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రచిన్ రవీంద్ర ముఖ్యంగా భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అయితే, డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారత బౌలింగ్ వ్యూహం మారిపోయింది. కుల్దీప్ యాదవ్ తెలివైన బౌలింగ్, ముఖ్యంగా రైట్ హ్యాండర్స్‌కు బయటకు బౌలింగ్ వేస్తూ, లెఫ్ట్ హ్యాండర్స్‌కు లెగ్ స్పిన్‌తో ఇబ్బంది పెట్టడంతో రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు కోల్పోయారు. చివర్లో మిచెల్ శాంట్నర్ 27 బంతుల్లో 47 పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ స్కోరును 208 పరుగులకు చేర్చాడు.
209 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు ప్రారంభంలోనే షాక్‌లు తగిలాయి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పెవిలియన్ చేరారు. ఈ దశలో న్యూజిలాండ్ విజయాలపై ఆశలు పెంచుకుంది. అయితే, ఇషాన్ కిషన్ అనూహ్యంగా క్రీజులోకి వచ్చి, అద్భుతమైన దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ గతిని మార్చేశాడు. అతని రూత్‌లెస్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్ బౌలర్లకు ఎలాంటి జవాబు దొరకనీయలేదు. ఇషాన్ కిషన్ తన సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన తర్వాత డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి, ఈ సిరీస్‌లో తిలక్ వర్మ గాయం కారణంగా జట్టులోకి వచ్చి, ఈ గొప్ప పునరాగమనాన్ని సాధించాడు.
ఇది చదవండి: ఆ ఒక్క సీన్ కోసం రేకుల బాత్రూమ్‌లోకి వెళ్లి.! సౌందర్య గొప్పతనానికి ఈ సంఘటన చాలు..
ఇషాన్ కిషన్ తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. 450 రోజుల తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన సూర్యకుమార్, టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ఉపశమనం. ఇషాన్ దూకుడుగా ఆడుతున్నప్పుడు సూర్యకుమార్ యాంకర్ పాత్ర పోషించి, స్ట్రైక్ రొటేట్ చేసి, ఆ తర్వాత తన ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. వారిద్దరూ 48 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో శివమ్ దూబే మూడు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయం ద్వారా, భారత్ టీ20 చరిత్రలో అత్యంత వేగంగా 200+ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా, తన అత్యధిక విజయవంతమైన ఛేదన రికార్డును కూడా సమం చేసింది(గతంలో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాపై 209 పరుగులు). 200+ లక్ష్యాలను అత్యధిక సార్లు ఛేదించిన జట్లలో ఆస్ట్రేలియా(8 సార్లు) తర్వాత భారత్(6 సార్లు) రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ బౌలర్ జాకరీ ఫౌల్క్స్ 3 ఓవర్లలో 67 పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును సృష్టించాడు. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ ఫీల్డింగ్, బౌలింగ్ పేలవంగా మారిందని చెప్పొచ్చు.
ఇది చదవండి: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




