Smriti Mandhana : పెళ్లి రోజే పాడు చేస్తూ పట్టుబడ్డ పలాష్..స్మృతి మంధాన దోస్తు షాకింగ్ కామెంట్స్
Smriti Mandhana : టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇప్పటి వరకు కేవలం మనస్పర్థల వల్లే పెళ్లి ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు విజ్ఞాన్ మానే చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. పలాష్ ముచ్చల్ స్మృతిని దారుణంగా మోసం చేశాడని, అతడు వేరే మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని మానే ఆరోపించడం ఇటు క్రీడా, అటు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Smriti Mandhana : టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ గత ఆరేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. గతేడాది నవంబర్ 23న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీనిపై తాజాగా స్మృతి చిన్ననాటి ఫ్రెండ్ విజ్ఞాన్ మానే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలను బయటపెట్టారు. పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలోనే పలాష్ మరో మహిళతో బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని మానే ఆరోపించారు. ఆ దృశ్యం చూసి అక్కడున్న స్మృతి సహచర మహిళా క్రికెటర్లు ఆగ్రహంతో పలాష్‌ను చితకబాదారని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా పలాష్ ముచ్చల్ కుటుంబాన్ని మానే చిల్లర దొంగలు అని సంబోధించారు. పలాష్ తీస్తున్న నజరియా సినిమాలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి తన దగ్గర రూ.40 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ పెరిగిందని, మరో రూ.10 లక్షలు ఇవ్వకపోతే పాత డబ్బులు కూడా తిరిగి ఇవ్వబోమని పలాష్ తల్లి అమితా ముచ్చల్ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన వాపోయారు. పెళ్లి ఆగిపోయిన తర్వాత ఆ కుటుంబం మొత్తం తనను ఫోన్‌లలో బ్లాక్ చేసిందని, అందుకే పోలీసులను ఆశ్రయించానని మానే తెలిపారు.
ఈ ఆరోపణలపై పలాష్ ముచ్చల్ స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్ట్ చేశారు. విజ్ఞాన్ మానే చేస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని, తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన లాయర్ శ్రేయాన్ష్ మిథారే ద్వారా చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. అయితే విజ్ఞాన్ మానే మాత్రం తన దగ్గర కాల్ రికార్డింగ్‌లు, చాటింగ్ ఆధారాలు అన్నీ ఉన్నాయని, వాటన్నింటినీ మీడియాకు, పోలీసులకు సమర్పిస్తానని సవాల్ విసిరారు.
ఒకవైపు స్మృతి మంధాన ఈ వివాదంపై ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ ఆమె ఫ్రెండ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పలాష్‌ను మహిళా క్రికెటర్లు కొట్టారన్న వార్త నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక, పెళ్లి రద్దు వెనుక ఉన్న అసలు వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఒకవేళ విజ్ఞాన్ మానే చెప్పినవన్నీ నిజమైతే పలాష్ ముచ్చల్ కెరీర్‌కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
