RCB: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్
RCBకి త్వరలోనే కొత్త ఓనర్ రాబోతున్నారు. మార్చి 31 నాటికి కోనుగోలు ప్రక్రియ పూర్తికానున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ఓనర్ ప్రకటించారు. RCB కోసం బిడ్ వేసేందుకు భారత్‌తో పాటు కొన్ని విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO బిడ్ వేస్తానని ట్వీట్ చేశారు.

18 సంవత్సరాల తర్వాత కప్ గెలిచిన RCB.. త్వరలోనే చేతులు మారనుంది. RCB ఫ్రాంఛైజీ ఓనర్ డియాజియో కంపెనీ ఇప్పటికే ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. RCB విలువ దాదాపు రెండు బిలియన్ డాలర్లుగా ఉంది. RCB ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడానికి భారత్‌తో పాటు కొన్ని విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా కూడా బెంగళూరు టీమ్‌ను దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. IPLలోని అత్యుత్తమ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడం కోసం బిడ్‌ను వేశానని అదర్ పూనావాలా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
మరోవైపు RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వాటా కోనేందుకు ముందుకు వచ్చారు. RCB ఫ్రాంచైజీలో 3 శాతం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. RCBలో వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఆ జట్టుతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే RCB ఫ్రాంచైజీ ద్వారా డియాజియోకు భారీగా ఆదాయం వస్తోంది. 18 సంవత్సరాల తర్వాత కప్ గెలిచిన RCB.. గ్రౌండ్‌లోనే కాదు.. మార్కెటింగ్‌లో కూడా ఛాంపియనే. కప్ గెలిచిన తర్వాత RCB బ్రాండ్ వాల్యూ 18.5 శాతం పెరగడంతో మొత్తంగా బ్రాండ్ వాల్యూ 2 వేల 327 కోట్లకు చేరింది. 2008లో IPL ప్రారంభమైనప్పుడు విజయ్ మాల్యా బెంగళూరు జట్టును కొనుగోలు చేశారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాల్యా.. యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ వాటాలను ఇంగ్లాండ్‌కు చెందిన మద్యం తయారీ సంస్థ డియాజియోకు విక్రయించారు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




