Buchi Babu: ‘ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్తే.. ఎక్కడో దొబ్బేశావ్ కదా అని అన్నారు’
ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు తన కెరీర్, మెగాస్టార్ చిరంజీవితో అనుభవం, జూనియర్ ఎన్టీఆర్‌తో తన స్నేహం, మహేష్ బాబుతో రిలేషన్‌పై ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. చిరంజీవి ఓ కథ నెరేషన్‌కు ఎలా స్పందిస్తారో కూడా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

దర్శకుడు బుచ్చిబాబు తన తొలి చిత్రం ఉప్పెన గురించి, స్టార్ హీరోలతో తనకున్న రిలేషన్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఉప్పెన సినిమా విజయం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తన స్నేహంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప్పెన సినిమా కథను చిరంజీవి స్వయంగా తనకు ఇచ్చి.. వైష్ణవ్ తేజ్‌తో సినిమా తీయమని అన్నారని దర్శకుడు బుచ్చిబాబు పేర్కొన్నారు. సుకుమార్ సర్ ద్వారా వైష్ణవ్‌ను పిలిపించి, తాను లాబీలో ఉండి వైష్ణవ్ స్టైల్‌ను గమనించినట్లు పేర్కొన్నారు. వైష్ణవ్ సినిమా కథను ఇష్టపడినా, తన మావయ్య చిరంజీవి ఓకే చేస్తేనే చేస్తానని చెప్పాడని, ఒక వారం తర్వాత చిరంజీవికి కథ చెప్పిన వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ అందుకున్నానని బుచ్చిబాబు వివరించారు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
చిరంజీవికి కథ చెప్పడానికి తాను ఎంసెట్, ఐసెట్ పరీక్షలకు సిద్ధమైన దానికంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యానని బుచ్చిబాబు సరదాగా అన్నారు. చిరంజీవి నెరేషన్ వినే విధానం అద్భుతమని, ఆయన కథ వింటున్నప్పుడు పాత్రల ఎక్స్‌ప్రెషన్స్‌ను స్వయంగా పలికిస్తారని, అది దర్శకుడిగా తనకెంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఏ కథ అయినా ముందు చిరంజీవికి వినిపించాలనే ఆలోచన కలిగిందని ఆయన పంచుకున్నారు.
ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..
ఇక ఎన్టీఆర్‌తో తన స్నేహం గురించి మాట్లాడిన బుచ్చిబాబు.. నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ సమయంలో లండన్, స్పెయిన్‌లలో తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశానన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తనను బుజ్జి అని ఆప్యాయంగా పిలిచి స్నేహాన్ని పెంచుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఎప్పుడూ అసిస్టెంట్ డైరెక్టర్ అనే భేదం చూపించకుండా, అందరితో కలిసిపోతారని తెలిపారు. ఒకానొక సందర్భంలో బుచ్చిబాబు ఎన్టీఆర్‌కు వేరే కథను చెప్పగా, దాన్ని ఎన్టీఆర్ ఎంతగానో ప్రశంసించారని, “నిజం చెప్పురా ఈ కథ ఎవరిదో దొబ్బేసావు కదా” అని సరదాగా అన్నారని గుర్తుచేసుకున్నారు. ఒక కథకు అంతకు మించిన కాంప్లిమెంట్ ఉండదని బుచ్చిబాబు చెప్పారు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




