AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ ఒక్క సీన్ కోసం రేకుల బాత్రూమ్‌లోకి వెళ్లి.! సౌందర్య గొప్పతనానికి ఈ సంఘటన చాలు..

దర్శకుడు దేవి ప్రసాద్ దివంగత నటి సౌందర్యతో తన అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. షూటింగ్ సమయంలో సౌందర్య నిరాడంబరత, కష్ట సమయాల్లో ఆమె ప్రవర్తన, ఫైవ్ స్టార్ హోటల్స్‌ను కాదని ప్రశాంతి కుటీర్‌లోనే ఉండటం లాంటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా..

Tollywood: ఆ ఒక్క సీన్ కోసం రేకుల బాత్రూమ్‌లోకి వెళ్లి.! సౌందర్య గొప్పతనానికి ఈ సంఘటన చాలు..
Soundarya
Ravi Kiran
|

Updated on: Jan 22, 2026 | 12:53 PM

Share

దర్శకుడు దేవి ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని పంచుకున్నారు. శ్రీనివాస్ చక్రవర్తి సౌందర్యను ఒకరోజు పరిచయం చేసినప్పుడు, ఆమె అప్పటికే కన్నడలో ఒక సినిమాలో నటించిందని, ఆమె తొలి తెలుగు చిత్రం మనవరాలి పెళ్లి అని ఆయన గుర్తు చేసుకున్నారు. కోడి రామకృష్ణ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ఆమెను ఎంచుకున్నారని, ఆ తర్వాత ఆమె స్టార్‌గా ఎదిగారని వివరించారు. సౌందర్య ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం గల నటి అని దేవి ప్రసాద్ అన్నారు. ఆమె చాలా పొలైట్‌గా ఉండేవారని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని, అలాగని విరుచుకుపడే తత్వం ఆమెకు లేదని తెలిపారు. చిలకపచ్చ కాపురం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన పంచుకున్నారు. రంగులతో కూడిన ఒక పాట చిత్రీకరణ తర్వాత, అప్పటికే పెద్ద హీరోయిన్ అయిన సౌందర్య, క్యారవాన్లు అందుబాటులో లేకపోవడంతో, ఒక చిన్న రేకుల బాత్‌రూమ్‌లో రంగులన్నీ కడుక్కుని, మళ్లీ మేకప్ వేసుకుని షూటింగ్‌కు సిద్ధమయ్యారని, ఆమె నిరాడంబరతకు అది నిదర్శనమని చెప్పారు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

సౌందర్య తండ్రి మరణించినప్పుడు, దేవి ప్రసాద్, కాస్ట్యూమ్ కృష్ణ, జగపతిబాబులతో కలిసి బెంగళూరు వెళ్లారు. అప్పటికే టాప్ స్టార్ అయిన సౌందర్య, అక్కడికి వచ్చిన బంధువులందరినీ, బాబాయ్, మామ్మ, మామయ్య అంటూ పేరుపేరునా పలకరించి, ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లో కూతురులాగా అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారని, ఇది తమను ఆశ్చర్యపరిచిందని దేవి ప్రసాద్ అన్నారు. పనివాళ్లు ఉన్నప్పటికీ, ఆమె స్వయంగా పనుల్లో పాలుపంచుకోవడం ఆమె గొప్పతనాన్ని చాటిందని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..

హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్‌లో హీరోయిన్లు దిగుతున్న రోజుల్లో కూడా, సౌందర్య తన అన్న అమర్, వదినతో కలిసి ప్రశాంతి కుటీర్ అనే గెస్ట్ హౌస్‌లో చివరి వరకు ఉండేవారని దేవి ప్రసాద్ చెప్పారు. ఆ రెండు రూములు ఆమెకు ఇల్లులా మారిపోయాయని, ఇది ఆమె మధ్యతరగతి మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. సౌందర్య ఎప్పుడూ గర్వం చూపలేదని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమా ఆర్టిస్టులు రాజకీయాల్లోకి వెళ్లడం పట్ల తనకు కోపం వచ్చిందని, సౌందర్య ఆ రోజు హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బాగుండేదో అని చాలా బాధ పడ్డానని దేవి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె అన్నయ్య అమర్‌తో సౌందర్యకు విడదీయరాని బంధం ఉండేదని, ఇద్దరూ ఒకేసారి మరణించడం చాలా బాధాకరమని అన్నారు.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..