Tollywood: ‘అలా అనుకుంటే ఎన్టీఆర్‌ను అడ్డంపెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని..’
సీనియర్ ఎన్టీఆర్ గొప్ప మనసును, నిస్వార్థ సేవను నటుడు, నిర్మాత చలపతిరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఎన్టీఆర్ తన డిమాండ్ ఉన్న రోజుల్లోనూ కష్టాల్లో ఉన్న నిర్మాతలకు డేట్లు ఇచ్చి సాయం చేశారని.. ఇతరులు బాగుండాలని కోరుకునే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని చలపతిరావు తెలిపారు.

సీనియర్ నటుడు, నిర్మాత చలపతిరావు సీనియర్ ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని, నిస్వార్థ సేవ గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం పని చేయలేదని, ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని కోరుకోలేదని చలపతిరావు స్పష్టం చేశారు. అలా చేసి ఉంటే కోట్లాది రూపాయలు సంపాదించే అవకాశం ఉండేదని, కానీ అలాంటి ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ఆయన వెల్లడించారు. కేవలం తన పిల్లలకు కోట్లు కూడబెట్టాలని, బిల్డింగ్‌లు కొనుగోలు చేయాలని తాను కోరుకోలేదని చలపతిరావు ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
ఎన్టీఆర్ గొప్పదనాన్ని వివరిస్తూ.. పలు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఎంత మంచివారంటే, ఆయనకు మంచి డిమాండ్ ఉన్న రోజుల్లో కూడా ఒక నిర్మాత దెబ్బతిన్నాడని తెలిస్తే, వెంటనే డేట్లు ఇచ్చేవారని తెలిపారు. “ఓ కిషోర్, ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో. ఎవరికన్నా అమ్ముకో” అని చెప్పేవారని, ఆ కిషోర్ ఆ డేట్లను ఇంకొకరికి అమ్మేవాడని ఆయన వివరించారు. అలా వచ్చిన లాభంతో పాత నిర్మాతకు రెండు లేదా మూడు లక్షల ప్రాఫిట్ దక్కేదని పేర్కొన్నారు. కొండవీటి సింహం లాంటి కొన్ని సినిమాలు ఈ విధంగా వేరే వారి డేట్ల ద్వారానే వచ్చాయని చలపతిరావు అన్నారు.
అంతేకాకుండా, ఆ సమయంలో ఎవరైనా కూతురి పెళ్లి చేసుకోవాలంటే వెంటనే డేట్లు ఇచ్చేవారని, ఆ డేట్లను అమ్ముకుని ఆ కూతురి పెళ్లి ఖర్చులు సమకూర్చుకునేవారని చలపతిరావు పేర్కొన్నారు. ఈ సాయం చేసినప్పుడు డబ్బులు వెంటనే వస్తాయో రావో అని అనుమానం ఉన్నా, ఆ డబ్బులు వచ్చేదాకా స్వయంగా తానే వచ్చి నిర్మాతను షూటింగ్‌కి తీసుకెళ్లేవారని, కారులో రావాలి అనే రూల్ పెట్టారని తెలిపారు. డబ్బులు వచ్చేసినయ్ అని తెలిసిన తర్వాతే ఆయన ఆ నిర్మాతను వదిలేసేవారని చలపతిరావు పేర్కొన్నారు. ఈ లక్షణాలన్నీ కలిపి ఎన్టీఆర్‌ను ఒక యుగ పురుషుడిగా నిలబెట్టాయని చలపతిరావు ప్రశంసించారు. సాధారణంగా ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉండాలని, అలాంటి అన్ని గొప్ప లక్షణాలు ఎన్టీఆర్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. కేవలం స్వార్థం కోసం కాకుండా, ప్రతివాడు బాగుండాలని, మనవారంతా బాగుంటేనే తనకు ఆనందం అని కోరుకునే మహోన్నత మనస్తత్వం ఎన్టీఆర్‌దని చలపతిరావు స్పష్టం చేశారు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




