Tollywood: ‘రవితేజకి నమ్మలేదు.. కానీ కళ్యాణ్ రామ్ కష్టమైనా కూడా.. నన్ను నమ్మాడు..’
బింబిసార సినిమా సమయంలో తాను ఎదుర్కున్న సవాళ్లను దర్శకుడు వశిష్ట గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. రవితేజకు మొదటిగా కథ చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నాడు. కళ్యాణ్ రామ్ తనపై నమ్మకంతో బింబిసార ప్రాజెక్టును మొదలుపెట్టారని తెలిపాడు. ఆ వివరాలు ఇలా..

బింబిసార దర్శకుడు వశిష్ట తాను కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్లను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ముఖ్యంగా బింబిసార ప్రాజెక్ట్ పట్టాలెక్కే ముందే కష్టాలను ఎదుర్కున్నానని తెలిపాడు. కళ్యాణ్ రామ్‌కు బింబిసార కథను చెప్పడానికి ముందు ఈ స్క్రిప్ట్‌ను ఏ ఇతర హీరోలకూ చెప్పలేదని వశిష్ట స్పష్టం చేశాడు. నేరుగా కళ్యాణ్ రామ్‌ను కలిసిన తర్వాత, ఆయనకు ఐడియా నచ్చి ప్రాజెక్ట్ మొదలుపెట్టామని తెలిపాడు. 2019 జనవరిలో కళ్యాణ్ రామ్‌ను కలిసిన వశిష్ట, సుదీర్ఘ చర్చల తర్వాత, 2019 డిసెంబర్ 9న సినిమాకు పూజ చేశామని పేర్కొన్నాడు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
అయితే, 2020 మార్చి 10న షూటింగ్ ప్రారంభించగా.. ఐదు రోజుల తర్వాత అంటే మార్చి 15న కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయిందని తెలిపాడు. లాక్‌డౌన్ సమయంలో సెట్‌ను అలాగే నిలిపి ఉంచాల్సి వచ్చిందని.. దీంతో బడ్జెట్‌పై ప్రభావం పడిందని చెప్పాడు. ఇక బింబిసారా పట్టాలెక్కే ముందు కొన్ని కథలను పలువురు నిర్మాతలకు చెప్పానని.. వారంతా కూడా “వన్, టూ ఇయర్స్ హోల్డ్ చెయ్, మళ్ళీ చేద్దాం” అని చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నాడు. అలాంటి వాటిలో రవితేజకి రెండుసార్లు ఒక కమర్షియల్ ఫిల్మ్ కథ చెప్పానని వశిష్ట వెల్లడించాడు. అయితే, ఆ సమయంలో రవితేజ కమిటెడ్ సినిమాలు, డేట్స్, బడ్జెట్ లాంటి కారణాలతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని తెలిపాడు. ఆ తర్వాతే బింబిసార కథ అనుకుని, అది కళ్యాణ్ రామ్‌కు నచ్చిందని, ప్రొడ్యూసర్ హరి కూడా తనను బలంగా నమ్మారని వశిష్ట వివరించాడు. “ఏది జరిగినా మన మంచికే అని కాన్సెప్ట్‌లో, ఆ రోజు అది జరిగి ఉంటే ఈ రోజు ఇది జరిగేది కాదు నాకు” అని, తన మొదటి చిత్రం ఇంత పెద్ద స్థాయిలో రావడానికి రాసిపెట్టి ఉందని వశిష్ట స్పష్టం చేశాడు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




