Phone Tapping Case: లీకులు.. సెటైర్లు.. లోపల ఏం జరుగుతోంది..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది..? ఎవరు ఎవర్ని ప్రశ్నిస్తున్నారు..? ఎవరిది టైమ్‌పాస్..? లోపల ఏం జరుగుతోంది.. లీకులిస్తోంది ఎవరు..తర్వాత వాటిని కవర్ చేస్తోంది ఎవరు..? గులాబీ దండులో ఇద్దరు అగ్రనేతలు, సేమ్ టోన్‌లో సిట్ విచారణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు..? ఇంతకూ ట్యాపింగ్ కేసులో సిట్ రైట్‌గా వెళ్తోందా..? రాంగ్ డైరెక్షన్‌లో పొలిటికల్ వెర్షన్ వినిపిస్తోందా..?

ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణ మరింత ఊపందుకుంది. అధికారులతో మొదలైన విచారణ, ఇప్పుడు రాజకీయ నేతలదాకా వచ్చింది. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. బీఆర్ఎస్‌లో ఇద్దరు కీలక నేతలను సిట్ రెండ్రోజుల వ్యవధిలో ప్రశ్నించింది. ఇద్దర్నీ సుమారు 7నుంచి 8గంటల పాటు విచారించింది. ఇక్కడ పాయింటేంటంటే ఎవరు ఎవర్ని ప్రశ్నించారన్నదే. సిట్ విచారణ చుట్టూ జరుగుతున్న చర్చను చూస్తే, బయట వినిపిస్తున్న మాటలకూ, లోపల జరిగిన పరిణామాలకూ మధ్య గ్యాప్ స్పష్టంగా ఉందంటున్నారు పరిశీలకులు. ఆధారాలన్నింటినీ ముందుంచి ప్రశ్నించామని సిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కాల్ డేటా, ఫైనాన్షియల్ లావాదేవీలు వంటి అంశాలపై ప్రశ్నలు వేసినట్టు ప్రెస్‌నోట్‌లో సిట్ తెలిపింది. అయితే విచారణకు హాజరైన నేతల వెర్షన్ మరోలా ఉంది. విచారణకు పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టారని, అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగి చిరాకు తెప్పించారే తప్ప, కీలకమైన ఆధారాలపై సిట్ దగ్గర స్పష్టత లేదని మాజీ మంత్రి కేటీఆర్ మాటల్లో వ్యక్తమైంది. “ప్రశ్నించాల్సింది వాళ్లు, కానీ ఆధారాల గురించి తానే ప్రశ్నించాల్సి వచ్చిందంటూ సిట్‌ను డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేటీఆర్ ఒక డైలీ సీరియల్‌తో పోల్చారు. సిట్ ప్రశ్నించడం కాదు, సిట్‌ను తానే ప్రశ్నించానని, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ జరిగాయా అన్నదానికి సమాధానం ఇవ్వకుండా సిట్ నీళ్లు నమిలిందన్నారు కేటీఆర్ ..
అంతేకాదు రాధాకిషన్‌రావుతో కలిపి కేటీఆర్‌ను విచారించినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలను కేటీఆర్ ఖండించారు. అయితే ఇలాంటి లీకులు బయటకు ఎలా వస్తున్నాయన్నదానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. లీకులిచ్చి, తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రెస్‌నోట్లు విడుదల చేస్తున్నారా అన్న వెర్షన్ కూడా ఇక్కడ వినిపిస్తోంది.
తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవద్దని నోట్‌లో సజ్జనార్ కోరారు. మరోవైపు మీడియాకు లీకులు ఎలా వస్తున్నాయో చెప్పాలంటోంది బీఆర్ఎస్. తనతో పాటు మరో వ్యక్తిని కూర్చోబెట్టి విచారిస్తున్నట్టు వార్తలొచ్చాయని, తాను తప్ప పురుగు కూడా విచారణ గదిలో లేదని, ఇలాంటి లీకులు ఎవరిస్తున్నారో అర్థమవుతోందంటూ సిట్ విచారణపై సెటైర్లు వేశారు కేటీఆర్..
ఇదే టోన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా సిట్ విచారణపై సెటైర్లు వేశారు. తామె సిట్‌కు వంద ప్రశ్నలు వేశామంటూ హరీష్ రావు కూడా రెండ్రోజుల కిందట తెలిపారు. సో..సిట్ కంటే తామే ప్రశ్నలు వేస్తున్నామన్న నేరేటివ్‌ను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తీసుకెళ్తోంది టోటల్ ఎపిసోడ్‌లో అసలు ఎవరు ఎవర్ని ప్రశ్నించారు అన్న ప్రశ్న ప్రజల్లో కలుగుతోంది. ప్రస్తుతం విచారణ గదిలో ఏం జరిగిందన్నదానికంటే, బయట జరుగుతున్న ప్రచారమే రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపుతోందంటున్నారు విశ్లేషకులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
