ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో కదులుతున్న కాశీ ఎక్స్ప్రెస్ ఎక్కబోయి ఓ వ్యక్తి తన చంటిబిడ్డతో కిందపడ్డాడు. రైలు మెట్లపై కాలు జారి వేలాడుతున్న అతడిని, అతడి చేతిలోని బిడ్డను రైల్లోని ప్రయాణికులు, అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి సురక్షితంగా రక్షించారు.