పాలు, పాల సంబంధిత ఉత్పత్తులన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అలాగే పాలతో చేసిన పనీర్ కూడా ఈ కోవకు చెందిందే
TV9 Telugu
పనీర్ టిక్కా మసాలా, పనీర్ ఖీర్, పనీర్ బర్ఫీ.. ఇలా పనీర్‌తో నోరూరించే కూరలు, స్వీట్లు చాలానే తయారు చేసుకోవచ్చు. రుచితోపాటు దీనిలో అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి
TV9 Telugu
అయితే పనీర్ వండాలంటే చాలా మంది మార్కెట్‌కు పరుగులు తీస్తుంటారు. మార్కెట్‌లో దొరికే పనీర్ కల్తీ జోరుగా సాగుంది. ఏదిపడితే అది తీసుకొచ్చి వండుకుంటే ఆరోగ్యానికి బదులు అనారోగ్యం పాలవ్వడం ఖాయం
TV9 Telugu
అలాకాకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, మృదువైన పనీర్ తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే.. మారెట్ స్టయిల్ పనీర్ కోసం ముందుగా పాన్‌లో కొంచెం నీరు పోయండి
TV9 Telugu
అందులో 2 లీటర్ల ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్ పోసుకోండి. ఇప్పుడు పాలను స్టవ్ మీద ఉంచి ఎకువ మంట మీద మరిగించాలి. అప్పుడప్పుడూ చెంచాతో కలుపుతూ.. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి
TV9 Telugu
ఇప్పుడు పాలు విరగడానికి వెనిగర్, నీరు కలిపి మరిగిన పాలలో పోయాలి. ఇప్పుడు పాలు విరుగుతాయి. అది జున్నులా కనిపిస్తుంది. విరిగిన పాలలో కొద్దిపాటి చల్లటి నీళ్లు పోయాలి
TV9 Telugu
ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంతో విరిగిన పాలను వడకట్టుకోవాలి. అలా మిగిలిన జున్నును వస్త్రంలోనే ఉంచి ఆ మూటపై కాస్త బరువు పెట్టి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి
TV9 Telugu
ఆ తర్వాత వస్త్రం నుంచి పనీర్ తీసి, ముక్కలుగా కట్ చేసుకుంటే సరి. వండుకున్న తర్వాత మిగిలిన పనీర్‌ను ఒక పాత్రలో వేసి, అందులో నీళ్లు నింపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. వారం రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది