గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురులో భర్త శివనాగరాజును భార్య మాధురి తన ప్రియుడు గోపితో కలిసి హత్య చేసింది. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి, నిద్రలో ఉన్నప్పుడు దిండుతో ఊపిరాడకుండా చేసి చంపింది. గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేయగా, బంధువుల ఫిర్యాదుతో మాధురి, గోపి అరెస్టు అయ్యారు.