AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకులు, పువ్వులూ రెండూ పవర్‌ఫులే.. ఆ సమస్యలున్న వారికి అపర సంజీవని..

చెన్నంగి ఆకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ గడ్డలను కరిగించడంలో సహాయపడుతుంది. పుదీనాతో కలిపి పచ్చడి లేదా పొడి రూపంలో దీన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటించడం ద్వారా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..

ఆకులు, పువ్వులూ రెండూ పవర్‌ఫులే.. ఆ సమస్యలున్న వారికి అపర సంజీవని..
Kasivinda Plant
Shaik Madar Saheb
|

Updated on: Jan 24, 2026 | 7:16 AM

Share

ప్రకృతిలో వేలకొలది సహజసిద్ధమైన ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో, వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని యాంటీబయాటిక్, యాంటీఆక్సిడెంట్ గుణాలు.. దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేయడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలా ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కల్లో చెన్నంగి ఆకు ఒకటి.. చెన్నంగి ఆకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి చెన్నంగి ఆకు కసివింద ఆకు కుటుంబానికి చెందినది. దీనిని కసివింద అని కూడా అంటారు.

ఎన్నో పోషకాలు..

చెన్నంగి ఆకు (కసివింద) లో విటమిన్ సి, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. చర్మ వ్యాధులను నివారించడం, జ్వరాలను తగ్గించడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చెన్నంగి ఆకు తెలంగాణ వంటి ప్రాంతాల్లో ఆకుకూరల దుకాణాలలో లభిస్తుంది. దీని పువ్వులు పసుపు వర్ణంలో ఉంటాయి. పసుపు రంగు పువ్వులు క్యాన్సర్ నిరోధక కారకాలుగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇవి శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడానికి, గడ్డలను కరిగించడానికి తోడ్పడతాయి.

కసివింద ఆకును గవదబిళ్ళలకు లేపనంగా ఉపయోగిస్తారు. దీని ద్వారా గవదబిళ్లలు నయమవుతాయి..

చెన్నంగి ఆకును పుదీనాతో కలిపి పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి.. పచ్చడి కాకుండా, చెన్నంగి ఆకును పొడి రూపంలో కూడా నిల్వ చేసుకుని.. తినవచ్చు..

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. చెన్నంగి ఆకును తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ సమస్యలున్న వారికి అపర సంజీవని ఈ ఆకు..
ఆ సమస్యలున్న వారికి అపర సంజీవని ఈ ఆకు..
ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్