దక్షిణాదిన ప్రతి ఇంటి వంట గదిలో జీలకర్ర నుంచి నల్ల మిరియాలు వరకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంటాం. ఇందులో ఖరీదైన కుంకుమ పువ్వు కూడా ఉంది
TV9 Telugu
కుంకుమ పువ్వు రంగు, రుచి, ప్రయోజనాలు దానిని పెంచే, తయారుచేసే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోనే కుంకుమపువ్వును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇరాన్
TV9 Telugu
కానీ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో పండించే కుంకుమపువ్వుకు డిమాండ్ ఎక్కువ. అత్యున్నత నాణ్యత కలిగినదిగా దీనికి పేరు. కాశ్మీరీ కుంకుమపువ్వులో ఉండే ప్రత్యేక సమ్మేళనం కారణంగా అది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది
TV9 Telugu
మీరు నిజమైన కాశ్మీరీ కుంకుమపువ్వును చూసినప్పుడు అందులో మూడు తంతువులు కలిసి ఉండటం గమనిస్తారు. కుంకుమపువ్వు దాని ఎరుపు రంగును క్రోసిన్ అనే సమ్మేళనం నుంచి పొందుతుంది
TV9 Telugu
ఇది ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంకుమపువ్వుకు ఎరుపు రంగును ఇచ్చే క్రోసిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది
TV9 Telugu
మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. క్రోసిన్ తో పాటు, కుంకుమ పువ్వులో పిక్రోక్రోసిన్, సఫ్రానల్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి
TV9 Telugu
ఇందులో క్రోసెటిన్, కెరోటినాయిడ్లలో అనేక విటమిన్లు కూడా ఉంటాయి. కుంకుమపువ్వు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వాపును తగ్గించడం, ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగించడం, రక్తపోటును నియంత్రిస్తుంది
TV9 Telugu
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు కలిపిన నీటిని తాగవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కుంకుమపువ్వు పాలు కూడా తాగవచ్చు